Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?

How the e-NAM App Lets You Sell Your Crops Online at Top Prices

How the e-NAM App Lets You Sell Your Crops Online at Top Prices

e-NAM App : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. ఇకపై మీ పంటలను మీరే అమ్ముకోవచ్చు.. అది కూడా గిట్టుబాటు ధరకే.. మధ్యవర్తులతో పని లేదు.. మీ పంటలకు మీరే మార్కెట్ రేటుకు తగినట్టుగా అమ్ముకోవచ్చు. అది కూడా ఇంటి వద్దనే ఉండి అమ్ముకోవచ్చు.

అది ఎలాగా అంటారా? e-NAM App ద్వారా వ్యవసాయం ఇప్పుడు డిజిటల్‌గా మారిందని మీకు తెలుసా? ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ దేశవ్యాప్తంగా రైతులకు ఎలా సాధికారత కల్పిస్తుందో వ్యవసాయ మంత్రిత్వ శాఖ వివరించింది.

మధ్యవర్తులతో సంబంధం లేకుండా కొనుగోలుదారులను నేరుగా రైతులతో కలుపుతుంది. భారత ప్రభుత్వం రైతులను ఆర్థికంగా శక్తివంతం చేసేందుకు డిజిటల్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఈ విషయంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ e-NAM లేదా ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్‌ను రైతుల “Digital Power”గా అభివర్ణించింది.

Advertisement

అగ్రికల్చర్ ఇండియా అధికారిక ఎక్స్ వేదికగా అందించిన సమాచారం ప్రకారం.. ఈ సిస్టమ్ రైతుల జీవితాలను మారుస్తోంది. రైతులు పొలాల్లో కష్టపడి పనిచేయడమే కాకుండా మార్కెట్‌లో గర్వంగా తమ ఉత్పత్తులను విక్రయించేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యం.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

e-NAM ప్లాట్‌ఫామ్ అంటే ఏంటి? :
రైతులు తరచుగా e-NAM అంటే (Electronic National Agriculture Market) ఏంటి? అది ఎలా పనిచేస్తుందో ఆలోచిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇది ఆన్‌లైన్ మార్కెట్. దేశవ్యాప్తంగా ఉన్న రైతులు, వ్యాపారులు, కొనుగోలుదారులను ఒకే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌పై కనెక్ట్ చేసే డిజిటల్ ప్లాట్‌ఫామ్.

గతంలో, రైతులు తమ పంటలను సమీప మార్కెట్‌లో మాత్రమే విక్రయించేవారు. కానీ, ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా రైతులే దేశవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులతో డిజిటల్‌గా కనెక్ట్ అవ్వొచ్చు. ఈ సిస్టమ్ వ్యవసాయం, వాణిజ్యం మధ్య అంతరాన్ని తగ్గిస్తుంది.

Advertisement

Read Also : 19 Minute Viral Video : బిగ్ అలర్ట్.. 19 మినిట్ వైరల్ వీడియోలో కొత్త ట్విస్ట్.. వెరీ డేంజరస్.. మీరు షేర్ చేస్తే జైలుకే..!

రైతులకు కలిగే 5 అతిపెద్ద ప్రయోజనాలివే :
సరసమైన పంట ధరలు : ఈ ప్లాట్ ఫారం అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. రైతులు తమ కష్టానికి తగిన ప్రతిఫలాలను పొందుతారు. మార్కెట్ పెద్దగా ఉండి ఎక్కువ మంది కొనుగోలుదారులు ఉన్నప్పుడు పంటలకు ఆటోమాటిక్‌గా మంచి ధరలు లభిస్తాయి.

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

మార్కెట్ పారదర్శకత : e-NAM మార్కెట్‌కు పారదర్శకతను అందిస్తుంది. ధర నిర్ణయ ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది. రైతులు తమ పంటల ధరను తమ కళ్ళ ముందు చూడగలరు. మోసం జరిగే అవకాశం ఉండదు.

Advertisement
e-NAM App

సులభంగా కొనడం, అమ్మడం : గతంలో ఈ పంటలను అమ్మాలంటే మార్కెట్లో రోజుల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. అయితే, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు పంటలను కొనడం, అమ్మడం చాలా సులభతరం చేశాయి. టెక్నాలజీ కారణంగా పేపర్ వర్క్, లాంగ్ క్యూల ఇబ్బందిని తగ్గించింది.

అధిక ఆదాయం, మెరుగైన డీల్స్ : దేశవ్యాప్తంగా రైతులు కొనుగోలుదారులను కనుగొని వారికి మెరుగైన డీల్స్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. మంచి ధర లభించడం వల్ల వారి ఆదాయం పెరుగుతుంది. వారు తమ ఉత్పత్తులను విక్రయించాల్సిన అవసరం తగ్గుతుంది.

డైరెక్ట్ కనెక్ట్ : ఈ ప్లాట్‌ఫామ్ కొనుగోలుదారులను నేరుగా రైతులతో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. మధ్యవర్తుల జోక్యాన్ని తగ్గిస్తుంది. గతంలో మధ్యవర్తులకు వెళ్ళిన లాభాలు ఇప్పుడు నేరుగా రైతుకు వెళ్ళేలా చేస్తుంది.

Advertisement
19 Minute Viral Video : బిగ్ అలర్ట్.. 19 మినిట్ వైరల్ వీడియోలో కొత్త ట్విస్ట్.. వెరీ డేంజరస్.. మీరు షేర్ చేస్తే జైలుకే..!

సమస్య వస్తే ఏం చేయాలి?
రైతుల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. ఎవరైనా రైతు e-NAM ప్లాట్ ఫారం అర్థం చేసుకోవడం లేదా వినియోగించడంలో ఏదైనా ఇబ్బందిని ఎదుర్కొంటే.. ఆయా రైతులకు “Farmer Call Center”ను సంప్రదించవచ్చు. ఈ ప్రయోజనం కోసం 1800-180-1551 అనే టోల్-ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంది. సమాచారం కోసం రైతులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య ఈ నంబర్‌కు కాల్ చేయవచ్చు.

Advertisement
Exit mobile version