Apple iphone 17 Pro : ఆపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో ఐఫోన్ 17 ప్రో రాబోతుంది. వచ్చే సెప్టెంబర్‌లో కంపెనీ (Apple iphone 17 Pro) అతిపెద్ద వార్షిక ఈవెంట్ కోసం రెడీ అవుతోంది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 17 ప్రో అతి త్వరలో లాంచ్ కానుంది.
Apple iphone 17 Pro : కొత్త రెండర్లు, బోల్డ్ కలర్ ఆప్షన్లు :
జూలై 30న బ్లూస్కీకి చెందిన టిప్‌స్టర్ కొత్త కెమెరా ఐలాండ్‌తో కూడిన ఐఫోన్ 17 రెండర్ చేసిన ఫొటోలను వెల్లడించారు. ఐఫోన్ ప్రో సిరీస్‌లో స్టాండర్డ్ వైట్, బ్రైట్ బ్లూ ఆప్షన్లతో పాటు కొత్త ఆరెంజ్ కలర్ ఆప్షన్ ఉంటుందని టిప్‌స్టర్ పేర్కొంది. ఈ రెండర్‌లు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నప్పటికీ, ఐఫోన్ 17 ప్రో టెస్ట్ యూనిట్లు శాన్ ఫ్రాన్సిస్కోలో కనిపించాయని, ఆపిల్ అదనపు కెమెరా ఫీచర్‌తో రానుందని అంచనా.
ఆపిల్ ఐఫోన్ 17 ప్రోపై ఎడ్జ్ దగ్గర థర్డ్ కెమెరా కంట్రోల్ ఉంటుంది. ఈ కొత్త ఫీచర్ కెపాసిటివ్ టచ్ స్క్రోల్ సర్ఫేస్ అయితే.. ఐఫోన్‌ను ల్యాండ్‌స్కేప్ ఓరియంటేషన్‌లో ఉండొచ్చు. ప్రైమరీ కెమెరా కంట్రోల్ రైట్ ఫింగర్ వేలితో యాక్సెస్ చేయొచ్చు. ఈ కొత్త ఫీచర్ లెఫ్ట్ చూపుడు వేలితో యాక్సెస్ చేయొచ్చు.
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో లాంచ్ ఎప్పుడంటే? :
బ్లూమ్‌బెర్గ్ మార్క్ గుర్మాన్‌తో సహా అనేక నివేదికల ప్రకారం.. ఈ లాంచ్ ఈవెంట్ సోమవారం, సెప్టెంబర్ 8, 2025 లేదా బుధవారం, సెప్టెంబర్ 10, 2025న జరగనుంది.
Apple iphone 17 Pro : డిజైన్, స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 17 ప్రోలో ఫ్రంట్ సైడ్ కెమెరా, ఫ్రంట్ సైడ్ సన్నని బెజెల్స్‌తో కూడిన డైనమిక్ ఐలాండ్ ఉంటుంది. 3 సెన్సార్లతో కూడిన దీర్ఘచతురస్రాకార కెమెరా ఐలాండ్, బ్యాక్ సైడ్ చివరి నుంచి చివరి వరకు విస్తరించి ఫ్లాష్ కలిగి ఉంటుంది. మాగ్‌సేఫ్ ఛార్జింగ్ కోసం ఆపిల్ లోగో డివైజ్ కొంచెం దిగువన ఉంటుంది.
ఆపిల్ ఐఫోన్ 17 ప్రోలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 8K వరకు వీడియోలను రికార్డ్ చేయొచ్చు. 48MP ప్రైమరీ లెన్స్, 48MP అల్ట్రా-వైడ్ లెన్స్, 48MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఆపిల్ వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 24MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అప్‌గ్రేడ్ కూడా అందిస్తున్నట్లు చెబుతున్నారు.
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల XDR OLED స్క్రీన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఆపిల్ A19 ప్రో చిప్‌సెట్, 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ద్వారా పవర్ పొందుతుంది. ఆపిల్ ప్రో మోడళ్లలో ర్యామ్ 4GB అందిస్తుంది.
ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఐఫోన్‌లో అతిపెద్ద బ్యాటరీని కలిగి ఉండొచ్చు. 5,500mAh వద్ద ఉంటుందని అంచనా. 15W Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్, 25W MagSafeకు సపోర్టు ఇస్తుందని అంచనా.