Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Vaibhav Suryavanshi : ‘పృథ్వీ షా’లాగా నాశనం అవ్వకండి.. యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ఫ్యాన్స్ గట్టి వార్నింగ్..!

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : క్రికెట్ ప్రపంచంలో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కొత్త సంచలనంగా మారాడు. తన ఆధిపత్య ప్రదర్శనతో అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. 14 ఏళ్ల వయస్సులో వైభవ్ సూర్యవంశీ తనదైన(Vaibhav Suryavanshi) శైలీలో బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. వరుసగా రికార్డులు సృష్టించాడు. ఐపీఎల్, యూత్ క్రికెట్ అయినా, వైభవ్ సూర్యవంశీ ప్రతిచోటా ఆధిపత్యం చెలాయిస్తున్నాడు.

ఐపీఎల్, యూత్ వన్డే చరిత్రలో వైభవ్ సూర్యవంశీ రికార్డు సెంచరీలు సాధించాడు. చిన్న వయసులోనే అభిమానుల హృదయాల్లో వైభవ్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వైభవ్ ఇంగ్లాండ్‌లో భారత అండర్-19 జట్టుతో ఉన్నాడు. ఆ జట్టు ఇటీవల ఆతిథ్య జట్టుతో జరిగిన టెస్ట్‌ డ్రాగా ముగిసింది.

తొలి యూత్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించాడు. దీనికి ముందు, ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

Advertisement
PM Kisan 22nd installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. e-KYC మాత్రమే కాదు.. ఈ డాక్యుమెంట్ లేకున్నా 22వ విడత డబ్బులు రావు

Vaibhav Suryavanshi : వైభవ్‌కు నెటిజన్లు వార్నింగ్ :

సోషల్ మీడియా యూజర్లు వైభవ్ సూర్యవంశీని పృథ్వీ షా లాగా మారవద్దని హెచ్చరించారు. పృథ్వీ షా తొందరగా ఫేమస్ అయ్యాడు. కానీ, ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో పృథ్వీ షాను కూడా ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.

ఐపీఎల్ ముగిసే సమయానికి సూర్యవంశీ అండర్-19 క్రికెట్‌లో సత్తా చాటుతున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన యూత్ వన్డే సిరీస్‌లో వరుసగా 48, 45, 86, 143, 33 పరుగులతో మెరిశాడు. ఆ తర్వాత ఆ జట్టుతో జరిగిన మొదటి యూత్ టెస్ట్‌లో 14, 56 పరుగులు చేశాడు.

Read Also : Post Office Scheme : మీ ఉద్యోగంతో పాటు ఈ పోస్టాఫీస్ పథకంతో ప్రతి నెలా రూ. 5,550 డబ్బు సంపాదించండి..

Advertisement
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

ఇంత చిన్న వయసులోనే సూర్యవంశీకి అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఆ ఆటగాడికి వస్తున్న ప్రజాదరణపై సోషల్ మీడియాలో చాలా మంది యూజర్లు కామెంట్లు పెడుతున్నారు. పృథ్వీ షా లాంటి పరిస్థితి అతనికి రాకూడదని అన్నారు. ఒకప్పుడు బ్యాటింగ్ సంచలనాలలో పృథ్వీ షా కూడా ఒకరిగా ఎదిగాడు. కానీ, అంచనాలను అందుకోలేక వెనుకబడి పోయాడు.

ఇటీవల, అన్య, రివా అనే ఇద్దరు అమ్మాయిలు వైభవ్ సూర్యవంశీతో ఫోటో దిగడానికి 6 గంటలు కారు నడిపారు. ఆ ఇద్దరు అమ్మాయిలు రాజస్థాన్ రాయల్స్ జెర్సీ ధరించి ఉన్నారు. ఈ అద్భుతమైన ఫొటోను రాజస్థాన్ రాయల్స్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది.

రాజస్థాన్ రాయల్స్ ఆ ఫోటోను పోస్ట్ చేసి.. “మా ఫ్యాన్స్ ఎందుకు బెస్ట్ అనేది ఇదిగో ప్రూఫ్.. వోర్సెస్టర్‌కు 6 గంటల డ్రైవింగ్. వారు ఆరెంజ్ కలర్ జెర్సీలు ధరించారు. వైభవ్, అన్య దాదాపు వైభవ్ వయసు వారే. వారి రోజు చిరస్మరణీయంగా ఉంటుంది” అని క్యాప్షన్ ఇచ్చింది.

Advertisement
IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?
Exit mobile version