G

Chandrababu Naidu : కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పందించిన చంద్రబాబు… ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టడంపై హర్షం !

Chandrababu Naidu : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కారు సిద్దమైన విషయం తెలిసిందే. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నా

Chandrababu Naidu : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కారు సిద్దమైన విషయం తెలిసిందే. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా ఈ విషయంపై స్పందించారు. జగన్ ప్రభుత్వం తీరుని చంద్రబాబు తప్పుపట్టారు. జనగణన పూర్తయ్యే వరకు జిల్లాల విభజన చేపట్టకూడదని కేంద్రం నుంచి ఆదేశాలున్నా ఏకపక్షంగా విభజన చేశారని చంద్రబాబు మండిపడ్డారు. అశాస్త్రీయంగా చేసిన కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తే పరిస్థితి నెలకొందన్నారు. మంత్రిర్గంలో చర్చించకుండా హడావుడిగా రాత్రికి రాత్రి నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు.

ప్రతి అంశంపైనా రాజకీయ ప్రయోజనం పొందాలని జగన్ ప్రభుత్వం చూస్తోందని చంద్రబాబు అన్నారు. ఈ సంధర్భంగా టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు ఆన్ లైన్ లో సమావేశం అయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు నేతలు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు నేతలు.

Advertisement

క్యాసినో వ్యవహారం, ఉద్యోగుల సమస్యలను పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియని హడావుడిగా తెరపైకి తెచ్చారని నేతలు చంద్రబాబు దగ్గర అభిప్రాయపడ్డారు. వాస్తవానికి. కొత్త జిల్లాల ఏర్పాటుపై వైసీపీలోనే వ్యతిరేకత వస్తోందన్నారు చంద్రబాబు.

tdp-president-chandrababu-naidu-respond-about-new-districts-in-ap

ప్రభుత్వ ఉద్దేశం ఏదైనా టీడీపీ మాత్రం స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాలని నేతలకు సూచించారు చంద్రబాబు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే మనమెందుకు వ్యతిరేకిస్తాం అని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ ను ఎవ‌రు గౌర‌వించినా స్వాగ‌తిస్తామన్నారు.

ఎన్టీఆర్ కేవ‌లం ఒక ప్రాంతానికి చెందిన నేత మాత్రమే కాదని … ఆయ‌న‌కు భార‌తర‌త్న ఇవ్వాల‌ని టీడీపీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోందని గుర్తు చేశారు. హైద‌రాబాద్ లో ఎయిర్ పోర్టుకు నాడు ఎన్టీఆర్ పేరును వైఎస్ఆర్ తొల‌గించినా, తాము మాత్రం క‌డ‌ప జిల్లాకు వైఎస్ పేరు పెట్టిన‌ప్పుడు వ్యతిరేకించ‌లేదని చంద్రబాబు గుర్తు చేశారు. టీడీపీ ద్వంద విధానాలు ఉండ‌వని తేల్చి చెప్పారు చంద్రబాబు.

Read Also : AP New Districts : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం… ఏవంటే ?

Advertisement
Ramesh Babu
రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.
Gold and Silver Prices Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం రేటు తగ్గింది, ఈరోజు తులం రేటు ఎంతంటే? ISRO IPRC Recruitment 2026 : టెన్త్ పాసైతే చాలు.. ఇస్రోలో జాబ్ కొట్టే ఛాన్స్.. నెలకు జీతం రూ.1.42 లక్షలపైనే..! Job Skills AI Era : కోడింగ్ రాకపోయినా ఫర్వాలేదు.. AI యుగంలో జాబ్ నిలబెట్టే 5 స్కిల్స్ Tirumala : టీటీడీ బిగ్ అలర్ట్.. 10 రోజుల పాటు ఈ దర్శనాలు రద్దు.. తిరుమల భక్తుల కోసం స్పెషల్ ఫుడ్ మెనూ Heavy Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన Bus Ticket Prices : ప్రయాణికులకు ఆర్టీసీ బిగ్ షాక్.. పండుగ స్పెషల్ బస్సుల్లో 50శాతం ఛార్జీలు పెంపు..
Konda Surekha : మూడు పార్టీలు, ఒక్క నిర్ణయం.. కొండా సురేఖ ముందున్న సవాళ్లు! Bangkok Telugu Students : బ్యాంకాక్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ భరోసా AP Cabinet Expansion : జనసేనకు నాలుగో మంత్రి పదవి ఖాయమేనా? నాగబాబుకేనా.. ఉత్తరాంధ్ర నేతకు ఛాన్స్‌ ఇస్తారా? Bankipur Bypoll Result : బంకిపూర్ బైపోల్ ఫలితంపై ప్రశాంత్ కిషోర్ బిగ్ స్టేట్‌మెంట్.. సామ్రాట్ చౌదరిపై ఘాటు వ్యాఖ్యలు! Telangana SIR Survey : తెలంగాణ ఓటర్లకు మరో ఛాన్స్.. SIR ఎన్యూమరేషన్‌ గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు Telangana Municipal Elections 2026 : తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు: మీ పోలింగ్ బూత్ ఎక్కడ? ఓటర్ స్లిప్ ఎలా పొందాలి?
మెనూ