Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా? జర జాగ్రత్త.. ఈ పని చేయకుంటే కార్డు రద్దు అవుతుంది.. ఇప్పుడే చెక్ చేసుకోండి!

Ration Card New Rules in Telugu

Ration Card New Rules in Telugu

Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, జర జాగ్రత్త.. రేషన్ కార్డు పథకంలో ఎప్పటికప్పుడూ కొత్త మార్పులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు (Ration Card new Rules) పథకంలో కొన్ని మార్పులు చేస్తోంది. రేషన్ కార్డు కలిగిన కుటంబాలన్నింటికి ప్రయోజనాలు అందాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేస్తోంది. అంతేకాదు.. రేషన్ కార్డు పథకాన్ని లబ్దిదారులకు పారదర్శకతంగా అందించేలా కేంద్రం ఈ దిశగా చర్యలు చేపడుతోంది. అందుకే, రేషన్ కార్డు కొత్త నిబంధనల గురించి కీలక అప్‌డేట్ ఒకటి వచ్చింది.

రేషన్ కార్డు కలిగిన లబ్దిదారులు ఎవరైనా సరే ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ రేషన్ కార్డుదారులు ఈ మార్గదర్శకాలను పాటించని పక్షంలో వారి రేషన్ కార్డులు రద్దు అవుతాయని గమనించాలి. కొత్త నిబంధనల ప్రకారం.. రేషన్ కార్డుదారులకు అర్హత ప్రమాణాలతో పాటు ప్రయోజనాలలో మార్పులు కూడా జరుగనున్నాయి. పథకానికి సంబంధించి కొత్త నియమ నిబంధనలు కూడా ఉన్నాయి. రేషన్ కార్డు నియమ నిబంధనల గురించి కీలక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్త రేషన్ కార్డు నియమాలివే :
కేంద్ర ప్రభుత్వం పేదల కోసం మొత్తం 3 రకాల రేషన్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది. ఈ రేషన్ కార్డులలో ఒక్కో కార్డుకు నియమాలు వేరుగా ఉంటాయని గమనించాలి. రేషన్ కార్డు కుటుంబాల్లో అర్హత ప్రమాణాలకు తగినట్టుగా లేకుండా ఆయా కార్డులన్నీ రద్దు అయ్యే ప్రమాదం ఉంది. రేషన్ కార్డులు రద్దు అయితే.. నిబంధనల ప్రకారం.. ఆయా కుటుంబాలకు ఆ తర్వాతి నెల నుంచి రేషన్ కార్డు ప్రయోజనాలను పూర్తిగా కోల్పోతారు.

Advertisement

Ration Card : రేషన్ కార్డుదారులు తప్పకుండా ఈ పనిచేయాలి :

రేషన్ కార్డు రద్దు ఎవరిది అవుతుందంటే? : 

కొత్త నియమాలను పాటించని రేషన్ కార్డుదారుల కార్డు రద్దు అవుతుంది. అంటే.. ప్రతి ఫ్యామిలీ KYC వెరిఫికేషన్ పూర్తి చేయాలి. KYC చేయించుకోని రేషన్ కార్డులు వెంటనే రద్దు అవుతాయి. అంతేకాదు.. కుటుంబ సభ్యుల్లో అందరి ఆధార్ వివరాలతో రేషన్ కార్డులో అనుసంధానం చేసి ఉండాలి. అలా చేయని పక్షంలో ఆయా రేషన్ కార్డులు కూడా రద్దు అవుతాయి. అలాగే, అసలు రేషన్ కార్డు ఉండి కూడా ఇప్పటివరకూ రేషన్ కార్డు తీసుకోకుండా ఉండేవారి కార్డులను కూడా రద్దు చేయొచ్చు. రేషన్ కార్డు ఉన్న అందరూ ఈ కొత్త నియమాలను తప్పక తెలుసుకుని పాటించాలి.

రేషన్ కార్డు సాయం పొందాలంటే? :

రేషన్ కార్డులో ఏమైనా తప్పులు ఉన్నా లేదా ఏదైనా సందేహలు ఉన్నా మీకు దగ్గరలోని రేషన్ ఆఫీసుకు వెళ్లవచ్చు. ప్రభుత్వ హెల్ప్ లైన్ నంబర్ కాల్ చేసి వివరాలను పొందవచ్చు. మీకు అవసరమైన సాయం అందించేందుకు పూర్తి సమాచారం ఎప్పుడు అందుబాటులో ఉంటుందని గమనించాలి.

Read Also : Rythu Bharosa : మీకు రైతు భరోసా డబ్బులు ఇంకా పడలేదా? ఆందోళన అక్కర్లేదు.. ఎందుకంటే?

Advertisement
Exit mobile version