Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

New Ration Card : కొత్త రేషన్‌ కార్డుదారులకు పండగే.. సెప్టెంబర్ 1 నుంచి నెలవారీ సన్న బియ్యం తీసుకోవచ్చు..!

New Ration Card : వచ్చే నెల సెప్టెంబర్​ 1 నుంచి కొత్త రేషన్ కార్డుదారులకు నెలవారీ రేషన్ అందించనున్నారు. రేషన్ దుకాణాల నుంచి సన్న బియ్యం సరఫరా (ration card holders rice scheme September 2025) చేసేందుకు పౌరసరఫరాల శాఖ రెడీ అవుతోంది. కొత్తగా రేషన్‌ కార్డులు అందినవారికి ఈసారి కోటా బియ్యం పంపిణీ చేయనున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో గత జూన్ నెలలో NFSA కార్డులకు సంబంధించి కోటా రేషన్ కూడా పంపిణీ చేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం త్వరలో రేషన్ కోటా కూడా మంజూరు చేయనుంది. వర్షాకాలం కావడంతో గత జూన్‌లో ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ చేశారు.

New Ration Card : సెప్టెంబర్ 1 నుంచే నెలవారీ రేషన్ :

జూలై, ఆగస్టులో బియ్యం పంపిణీ చేయలేదు. రేషన్ కార్డు దుకాణాలను మూసివేశారు. 3 నెలలు తర్వాత రాబోయే సెప్టెంబర్‌ నుంచి రేషన్ పంపిణీ చేసే అవకాశం ఉంది. వచ్చే నెలలో తిరిగి నెలవారీ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement

ఈసారి కొత్త రేషన్​కార్డులతోపాటు పాత రేషన్​కార్డులు, కొత్తగా సభ్యులుగా చేరిన వారికి కూడా రేషన్ పంపిణీ (Sanna Biyyam scheme latest update Telangana) చేయనున్నారు. ఇప్పటికే సెప్టెంబర్ నెల కోటా సన్న బియ్యం రాష్ట్ర స్థాయి గోదాముల (స్టేజ్ 1) నుంచి మండల లెవల్ స్టాక్ (MLS) పాయింట్లకు పంపిణీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లకు సంబంధించి పౌరసరఫరాల శాఖ పర్యవేక్షిస్తోంది. వచ్చే సోమవారం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించినట్టు సమాచారం.

Read Also : Millet Benefits : మిల్లెట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.. వద్దన్నా ఇవే రోజూ తినేస్తారు!

కొత్తరేషన్ కార్డుదారులందరికి సెప్టెంబర్ నుంచి సన్న బియ్యం పంపిణీ చేయాల్సిందిగా పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈసారి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యంతో పాటు చేతి సంచిని కూడా (Telangana ration card rice distribution 2025) అందజేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది.

Advertisement

New Ration Card : కొత్త 96,060 రేషన్ కార్డులకు రేషన్ :

ప్రతినెలా డైనమిక్ కీ రిజిస్ట్రర్​(DKR) జనరేట్ అవుతుంది. ఈ కీ రిజిస్ట్రర్‌ జనరేట్ అయ్యే సమయానికి ఎన్ని రేషన్ కార్డులు ఉంటే అన్ని కార్డులకు రేషన్ కోటాను కేటాయిస్తారు. గత ఏప్రిల్​ 25న డైనమిక్ కీ రిజిస్టర్​ జనరేట్ అయింది.

ration card holders rice scheme September 2025

అప్పటికే విడుదల అయిన అన్ని రేషన్​కార్డులకు, కొత్తగా చేరిన రేషన్ కార్డులో సభ్యులకు 3 నెలల బియ్యం పంపిణీ చేశారు. ఏప్రిల్ 2025 నాటికి ఉమ్మడి జిల్లాలో 10,17,023 రేషన్ కార్డులు విడుదల చేయగా గత మేలో రేషన్ కార్డుదారులకు పంపిణీ చేశారు.

గత మే 25 వరకు 10,29,230 రేషన్ కార్డులు వచ్చాయి. గత జూన్​నెలలో రేషన్ కార్డుదారులందరికి 3 నెలల కోటా బియ్యం ఒకేసారి అందించారు. మే 25 నుంచి ఆగస్టు 9 వరకు కొత్తగా 96,060 రేషన్ కార్డులు విడుదల అయ్యాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లాలోని రేషన్ కార్డుల సంఖ్య 11,25,290కు చేరింది. ఈ రేషన్​కార్డుల్లో 34,05,671 మంది సభ్యులుగా ఉన్నారు. అందరికి 20,434 టన్నుల రేషన్ అందించనున్నారు.

Advertisement
Exit mobile version