Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Whats app payments: వాట్సాప్ లోనూ క్యాష్ బ్యాక్.. ఇక పండగే!

దేశంలో యూపీఐ లావాదేవీలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కరోనా పుణ్యాన డిజిటల్ పేమెంట్లు చేసే వారి సంఖ్య మరింత పెరిగిపోయింది. అయితే ఫోన్ పే, గూగుల్ పే, పేటీఆమ్ లనే ఎక్కువగా వాడుతుంటారు చాలా మంది. కానీ సామాజిక మాధ్యమ దిగ్గజం అయిన వాట్సాప్ కూడా వాట్సాప్ పేమెంట్స్ను ప్రారంబించింది. కానీ ఎక్కువగా లావాదేవీలు జరగకపోవడంతో బంపర్ ఆఫర్ ను ఇచ్చింది. కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు క్యాష్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది.

వాట్సాప్ ద్వారా వ్యాపార చెల్లింపులను తీసుకు రావడంపై దృష్టి సారించినట్లు వివరించింది. ఇటీవలే వాట్సాప్​ పేమెంట్​ సర్వీస్​ లిమిట్​ను 100 మిలియన్​ యూజర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది నేషనల్​ పేమెంట్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా(ఎన్​పీసీఐ). ఇప్పటికే భారత్​లో 400 మిలియన్లకుపైగా వినియోగదారులు ఉన్న వాట్సాప్​కు అది పెద్ద సానుకూల అంశం. అలాగే వాట్సాప్​లో క్యాష్​బ్యాక్​ పొందాలంటే నగదు చెల్లింపులపై ఎలాంటి కనీస పరిమితులు లేవు. ఒక రూపాయి సైతం పంపించొచ్చు. వారు కూడా క్యాష్​బ్యాక్​కు అర్హులే. అయితే.. ఈ ఆఫర్​ మూడు లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది.

Advertisement
Exit mobile version