Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Viral video: విమానం ఎక్కించుకోకపోతే ఇలా కూడా చేస్తారా..?

Viral video: విమానాలు కచ్చితమైన సమయపాలన పాటిస్తాయి. చాలా కొద్ది సందర్భాల్లో మాత్రమే విమానాలు ఆలస్యం అవుతాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించని పరిస్థితుల్లో, సాంకేతిక సమస్యలు తలెత్తిన సందర్భాల్లో మాత్రమే విమానాలు లేట్ అవుతుంటాయి. అలాగే ప్రయాణికులకు బోర్డింగ్ పాస్ ఇవ్వడం, వారిని ఫ్లైట్ లోకి ఎక్కించడం వంటిని నిర్ణీత సమయానికి జరుగుతుంటాయి.

ఆలస్యంగా వచ్చిన ప్రయాణికుల పట్ల విమాన సిబ్బంది కొందరు కఠినంగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఇలాగే జరిగిన ఓ ఘటన నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆలస్యంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ మహిళ పట్ల విమాన సిబ్బంది ప్రదర్శించిన తీరు ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ సందర్భంలో మహిళ చేసే పని ఆకట్టుకుంటోంది. విమాన సిబ్బంది తనను అనుమతించలేదని ఆవేదన చెందింది. బాధతో నేలపై పడి విలపించింది.

Advertisement

దిల్లీ ఎయిర్ పోర్టులో ఈ ఘటన వెలుగుచూసింది. మహిళకు మధుమేహం, గుండె సమస్యలు ఉన్నాయని, దీంతో తాము ఐదు నిమిషాలు ఆలస్యంగా వస్తామని సిబ్బందికి ముందే సమాచారం ఇచ్చినట్లు బాధితురాలి బంధువులు చెప్పారు. ఈ సమయంలో సిబ్బంది వైద్య సాయం చేయకుండా సెక్యూరిటీని పిలిచి వారిని ఎగ్జిట్ గేటు వద్ద వదిలి రమ్మని ఆదేశించినట్లు తీవ్ర మనస్తాపానికి గురైంది.

ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా.. తమ ఇమేజ్ ను తప్పు దోవ పట్టించేదిగా ఉందని తెలిపింది. వాస్తవాలు తెలుసుకోకుండా, తమ వివరణ కోరకుండా కొందరు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement
Exit mobile version