Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Viral Video: డాన్స్ వీడియో తీస్తూ వెంటనే పారిపోయిన యువతులు.. అసలు కారణేమిటో తెలుసా..?

Viral Video: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు వాడే వారీ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి ముసలివారి వరకు అందరూ స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. అందువల్ల చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమలో ఉన్న టాలెంట్ ని బయట పెడుతున్నారు. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడం వలన సోషల్ మీడియా వేదికగా చాలా మంది తమలో ఉన్న ప్రతిభను బయటపెట్టి అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందుతున్నారు. కొంతమంది ఓవర్నైట్ స్టార్లుగా మారిపోతున్నారు.

ఈ రోజుల్లో చాలా మంది తమలో ఉన్న టాలెంట్ నిరూపించుకోవటానికి డాన్స్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా వాటిని షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు కూడా అబ్బాయిలతో పాటుగా డాన్స్ వీడియోలు చేస్తూ ఫేమస్ అవుతున్నారు. ఏవైనా ఫక్షన్, పెళ్లి వేడుకలో ఇక అమ్మాయిల డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఇక యువతి డాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


అసలు విషయంలోకి వెళ్తే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో టెర్రస్ మీద ఒక యువతి చుట్టూ ఎవరూ తమని గమనించటం లేదని భావించి డాన్స్ చేస్తూ ఉండగా మరొక యువతి దానిని వీడియో తీస్తూ ఉంది. అయితే వీరు డాన్స్ చేస్తున్న విషయాన్ని గమనించిన పక్కింటి వారు ఈ మొత్తం సంఘటన వీడియో తీయటం మొదలు పెట్టారు. ఈ విషయం గమనించిన ఇద్దరు యువతులు వెంటనే డాన్స్ చేయటం ఆపేసి అక్కడినుండి పరుగు తీశారు. ఈ వీడియో చుసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement
Exit mobile version