Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవయాని, సాక్షి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి వసు, జగతి వస్తారు.
ఈరోజు ఎపిసోడ్ లో వసుధార జగతి అక్కడికి రావడంతో వెంటనే సాక్షి కోపంతో రగిలిపోతూ ఇదంతా నీ వల్లనే జరిగింది. నా లైఫ్ ఇలా అవ్వడానికి కారణం నువ్వే అంటూ వసుని తిడుతూ ఉండగా ఇంతలోనే రిషి అక్కడికి వచ్చి సాక్షిని అసహ్యించుకొని కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత వసుధార జగతితో మాట్లాడుతూ రిషి సార్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో నేను అడుగుతాను అని అనగా అప్పుడు జగతి వద్దు అని అంటుంది.
ఆ తర్వాత వారిద్దరు మాట్లాడుకున్న తర్వాత వసు ఆలోచిస్తూ కిందికి వెళ్తూ మెట్లు జారి కింద పడిపోతూ ఉండగా ఇంతలోనే రిషి వచ్చి పట్టుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరి కళ్ళలో ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి దేవయాని వస్తుంది. అప్పుడు రిషి చూసుకుని వెళ్లొచ్చు కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మహేంద్ర, తీసుకున్న నిర్ణయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ అసలు రిషి ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు.
ఇంతలోనే దేవయాని అక్కడికి వచ్చి ధరణితో అందరికీ సీట్స్ తీసుకొని రమ్మని చెబుతుంది. అప్పుడు మహేంద్ర ఎందుకు ఈ హడావిడి వదిన అని అనగా రేపు సాక్షి వాళ్ళ అమ్మానాన్న ముహూర్తం పెట్టుకోవడానికి వస్తున్నారు అని చెప్పడంతో వారందరూ షాక్ అవుతారు. అప్పుడు మహేంద్ర దేవయానితో మాట్లాడుతూ ఎలా అయినా ఈ పెళ్లి ఆగిపోయేలా చెయ్ వదినా అని అంటాడు.
అప్పుడు ధరణి గౌతమ్ తో మాట్లాడుతూ ఇదంతా అత్తయ్య డ్రామా అని అంటుంది. అప్పుడు మహేంద్ర దేవయానికి ఎంత చెప్పినా కూడా వినిపించుకోదు. ఆ తర్వాత రిషి కార్లో వెళ్తూ ఉండగా వసుధర వెళ్లి అడ్డుపడి రిషి సాక్షి విషయంలో తప్పు నిర్ణయం తీసుకున్నారు అనీ వసునీ మార్చే ప్రయత్నం చేస్తుంది. సాక్షి గతంలో మీకు చేసిన విషయాలన్నీ మర్చిపోయారా అని అడుగుతుంది.
మరొకవైపు జగతి దంపతులు రిషి నిర్ణయం గురించి ఆలోచిస్తూ ఎమోషనల్ అవుతూ ఉంటారు. అప్పుడు జగతి వాళ్ళు మాట్లాడుకుంటూ ఎందుకు రిషి ఇలా చేస్తున్నారు అని బాధపడుతూ ఉంటారు.
- Guppedantha Manas seurial Sep 7 Today Episode : వసుధారని తన ఇంటిలో పర్మినెంట్ గా ఉండిపోమని అడిగిన రిషి.. సరికొత్త ప్లాన్ వేసిన దేవయాని..?
- Guppedantha Manasu june 30 Today Episode : ధరణిపై మండిపడ్డ దేవయాని..సాక్షి చేసిన పనికి వసుధారని తప్పుగా అపార్థం చేసుకున్న రిషి..?
- Guppedantha Manasu june 6 Today Episode : వసును తలుచుకుంటూ యాక్సిడెంట్ కి గురైన రిషి… మాటలతో బాధ పెట్టిన దేవయాని!
