Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Guppedantha Manasu September 10 Today Episode : వసుధారకి ప్రేమతో వడ్డించిన రిషి.. సంతోషంలో జగతి దంపతులు..?

Guppedantha Manasu September 10 Today Episode : తెలుగు బుల్లి తెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు పనిచేసే రెస్టారెంట్ కి జగతి దంపతులు వెళ్తారు. ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర, వసు ని ప్రశ్నిస్తూ మా పెళ్లి రోజు ఫంక్షన్ కి రిషి ని ఒప్పించాలి అని నీకు ఎందుకు అనిపించింది అని అడుగుతాడు. అప్పుడు వసు ఇందులో నా గొప్ప ఏమి లేదు సార్. ఇందులో ఒక అద్భుతం జరిగింది. రిషి సార్ ని ఒప్పించాలి అన్న ఆలోచన దేవయాని మేడం ది అనడంతో జగతి మహేంద్ర ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడు వసు మాటలు విని ఆశ్చర్యపోయిన జగతి ఆలోచనలో పడుతుంది.

Vasudhara feels elated as Rishi takes care of her in todays guppedantha manasu serial episode

దీని వెనుక ఏమైనా కుట్ర ఉందేమో అని జగతి,మహేంద్రతో అంటుంది. ఇప్పుడు జగతి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వసుధార కళ్ళు మూసుకొని ఉంటుంది. ఏం చేస్తున్నావ్ వసు అని అడగగా మేడం రిషి సార్ వస్తున్నారు అనటంతో మహేంద్ర వాళ్ళు మాకు కారు హారన్ సౌండ్ కూడా వినిపించలేదు కదా ఎలా చెప్తున్నావ్ అని అంటుండగానే ఇంతలోనే ఎక్కడికి రిషి రావడం చూసి మహేంద్రవాళ్లు ఆశ్చర్యపోతారు.

ఆ తర్వాత రిషి అక్కడికి రావడంతో మహేంద్రవాళ్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు రిషి, బయలుదేరు బయటికి వెళ్దాం అని అంటాడు. ఇప్పుడు రిషి సార్ పర్మిషన్ అనగానే నువ్వు వెళ్తావా లేకుంటే నన్ను మేనేజర్ దగ్గరికి వెళ్ళమంటావా అంటే వద్దు సార్ నేనే వెళ్తాను అని బయలుదేరుతుంది. మరొకవైపు గౌతమ్ ఫంక్షన్ కి ఏమేం కావాలి అనే దేవయానిని అడుగుతూ ఉంటాడు.

Advertisement

Guppedantha Manasu September 10 Today Episode :  సంతోషంలో జగతి దంపతులు..?

అప్పుడు దేవయాని విసుక్కుంటూ సమాధానం చెబుతూ ఉంటుంది. ఇంతలోనే రిషి, వసు ని రావడం చూసి దేవయాని షాక్ అవుతుంది. ఆ తర్వాత వసు లోపలికి రావడంతో నవ్వుతూ వెళ్లి లోపలికి రమ్మని పిలుస్తుంది. అప్పుడు దేవయాన్ని ఎందుకు అలా మాట్లాడుతుందో వసుధారకి అర్థం కాక అయోమయంలో ఉంటుంది. రిషి అక్కడికి వచ్చి ఫంక్షన్ పనుల్లో వదినకు తోడుగా ఉంటుంది అని నేనే తీసుకు వచ్చాను అని అంటున్నాడు.

ఇంతలోనే జగతి అక్కడికి రావడంతో వసుధారకి పనులు అప్పజెప్పమని చెబుతాడు. మరొకవైపు దేవయాని ప్రవర్తనను గమనించిన మహేంద్ర వదిన ప్రవర్తనలో నాకెందుకో తేడా కొడుతోంది అని ఆలోచిస్తూ ఉంటాడు. మరొకవైపు గౌతమ్ ఫంక్షన్ ఎలా గ్రాండ్ గా చేయాలా అని తెగ ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి మహేంద్ర వస్తాడు. అప్పుడు మహేంద్ర కూడా కొన్ని ఆలోచనలు చెబుతాడు. ఇంతలోనే ఎక్కడికి జగతి వసుధారలు రావడంతో వారందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు.

ఇప్పుడు అందరూ కలిసి వసు ని ఆట పట్టించే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు వసు కి రిషి వడ్డించడంతో చూసి జగతి దంపతులు మురిసిపోతూ ఉండగా దేవయాని లోలోపల కుళ్లుకుంటూ ఉంటుంది. ఇప్పుడు అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రిషి, వసు పై ప్రేమ చూపిస్తున్నాడని చూసి దేవాయని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ కలసి ఫంక్షన్ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇంతలో రిషి అక్కడికి వచ్చి వసుధారని చూసి మురిసిపోతూ ఉంటాడు. వసు కూడా రిషి వైపు అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడు మహేంద్ర రిషి ని పూలు మనం కూడా కడదాం అంటూ అడ్డంగా బుక్ చేస్తాడు.

Advertisement

Read Also : Guppedantha Manasu September 9 Today Episode : రిషిని ఒప్పించిన వసు..జగతి మాటలు విని ఆలోచనలో పడ్డ రిషి..?

Exit mobile version