Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Guppedantha Manasu Dec 12 Today Episode : పెళ్లి గురించి ఆలోచిస్తున్న వసుధార, రిషి.. సంతోషంలో జగతి..?

Guppedantha Manasu Dec 12 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో వసుధార రిషి ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు.

ఈరోజు ఎపిసోడ్ లో వసుధార, రిషి ఇద్దరు కలిసి పానీపూరి బండి దగ్గరికి వెళ్తారు. అప్పుడు వసుధార పానీపూరి బండి దగ్గర మెను మొత్తం చెప్పడంతో వెంటనే రిషి వెటకారంగా వసుధార నేను ఇవాల్టికి మాత్రమే తినాలి అనుకున్నాను నువ్వు చూస్తే మూడు పూటలకు సరిపడేలా తినిపించేలా ఉన్నావు అనడంతో సరే సార్ మీ ఇష్టం అని పెద్దయ్య రెండు పానీ పూరి ఇవ్వండి అని అంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి పానీపూరీ తింటూ ఉండగా వెంటనే వసు అలా కాదు సార్ పానీపూరి ఇలా తినాలి అని చూపిస్తూ ఉంటుంది వసుధార.

Guppedantha Manasu Dec 12 Today Episode

ఆ తర్వాత వాళ్లు పానీ పూరి తింటుండగా ఇంతలో అతను మీ పెళ్లెప్పుడు సార్ అని అనడంతో వారిద్దరూ సిగ్గుపడుతూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అదేంటి ఉన్నఫలంగా అలా అడిగేసావు అని అడగగా ఏమీ లేదు సార్ ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉన్నారు అందుకే అలా అడిగాను అని అనగా సరే అని అంటారు. మీ పెళ్లికి తప్పకుండా పిలవండి పానీ పూరి బండి పెడతాను అనడంతో వసుధార,రిషి చూసుకుంటూ సిగ్గుపడుతూ ఉంటారు.

Advertisement

ఆ తర్వాత వసుధార వాళ్ళు అక్కడి నుంచి వెళుతుండగా ఇంతలో రిషి వసుధారని దగ్గరికి పిలిచి అతను అన్న మాటలు నవ్వుతూ కొట్టిపడేయకుండా ఆ విషయాల గురించి ఆలోచించాలి. పెళ్లి చేసుకుందాం వసుధార ఈ విషయం గురించి పెద్దమ్మతో మాట్లాడతాను అని అనగా వసుధార ఆలోచనలో పడుతుంది. నాకు తెలిసి వసుధార మీ కుటుంబం గురించి అడిగితే నీకు చేదు జ్ఞాపకాలు అన్ని గుర్తుకు వస్తాయి. నువ్వు పెళ్లి పీటల నుంచి ధైర్యంగా లేచి వచ్చావు అంటే నీ ధైర్యం నాకు నచ్చింది.

అలాగే మన పెళ్లి విషయంలో నువ్వు మీ కుటుంబ సభ్యులని ఒప్పిస్తావని అనుకుంటున్నాను అని అనగా వసుధార తన గతం మొత్తం చెప్పుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉండగా అప్పుడు రిషి వసుధార కన్నీళ్లు తుడుస్తాడు. అప్పుడు వెంటనే వసుధార ద్వారా రిషిని హత్తుకుంటుంది. తర్వాత రిషి వసుధారలో మినిస్టర్ దగ్గరికి వెళ్ళగా అప్పుడు మినిస్టర్ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు నుంచి జగతి మేడం తప్పుకుని వసుధార ఆస్థానంలో నియమించాలి అనుకుంటుంది అనడంతో వసుధార, రిషి ఇద్దరు షాక్ అవుతారు.

తనకు ఆరోగ్యం అంతగా సహకరించడం లేదని అందుకే తాను ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పింది అనగా రిషి సరే సార్ అని అంటాడు. మరొకవైపు జగతి తన కాలేజీ స్టాప్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత వసుధర సర్ అంత పెద్ద బాధ్యతను నేను ఎలా నిర్వర్తించగలను అనడంతో వెంటనే వసుధార సర్ నేను చెబుతున్నాను వసుధార మిషన్ ప్రాజెక్టుకి హెడ్ గా ఉంటుంది అనే రిషి అంటాడు. దాంతో మినిస్టర్ సంతోషపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన వసుధార టెన్షన్ పడుతూ ఉంటుంది.

Advertisement

అప్పుడు జగతి దగ్గరికి వెళ్లి ఏంటి మేడం రిషి సార్ కూడా నన్ను ప్రాజెక్టు హెడ్గా ఒప్పుకున్నారు అనడంతో జగతి సంతోషపడుతూ మంచి విషయమే కదా అని ఆనందపడుతూ ఉంటుంది. తరువాత రిషి మెసేజ్ చేయడంతో వసుధార అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వసుధారసీ చెప్పిన ప్రదేశానికి వెళ్లగా అక్కడ రిషి లేకపోవడంతో ఎక్కడికి వెళ్లాడు అనుకుంటూ ఉండగా ఇంతలో రిషి స్పీడ్ గా వచ్చి వసుధార చేయని దొంగగా లాక్కొని వెళ్లడంతో వెంటనే వసుధార ఏంటి సార్ మీరు ఇప్పటికే టెన్షన్తో భయపడుతుంటే మీరు ఇంకా భయపెడతారు అని అనగా ఏంటి వసుధార నువ్వు భయపడుతున్నావా అని అనడంతో అవును సార్ అంత పెద్ద ప్రాజెక్ట్ అప్పగించారు అని అనగా వెంటనే రిషి వసుధార చేతులు పట్టుకొని నీకు ఏం కాదు రిషి ఉన్నాడు ధైర్యంగా ఉండు అని ధైర్యం చెబుతాడు.

Read Also : Guppedantha Manasu Dec 10 Today Episode : వసుధారకి ధైర్యం చెప్పిన రిషి.. సరికొత్త ప్లాన్ వేసిన దేవయాని..?

Advertisement
Exit mobile version