Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Intinti Gruhalakshmi: ప్రవళిక స్థాయి తెలిసి నోరు వెళ్ళబెట్టిన తులసి.. ఇంతకూ ప్రవళిక ఎవరో తెలుసా?

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే తులసి నా పిల్లలు అమ్మ మనసు తెలిసిన వాళ్ళు అని గర్వంగా చెబుతుంది. మొత్తానికి తులసి స్టేజ్ పై అమ్మ ప్రేమ గురించి ఎంతో గొప్పగా చెబుతుంది. ఇక అందరూ చప్పట్లు కొడతారు. ఇక లాస్య, నందులు మాత్రం తులసిపై ఎంతో జలసీ గా ఫీల్ అవుతారు.

ఆ తర్వాత తులసి ప్రవళిక ను వెతుక్కుంటూ ఉంటుంది. ఈలోపు కాంపిటీషన్ విన్నర్ గా తులసి ని సెలెక్ట్ చేస్తారు. దాంతో ఫ్యామిలీ మొత్తం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక లాస్య తులసి పై ఎంతో అసూయ పడుతుంది. ఇక ఆ ఫంక్షన్ లో కొందరు మేము తులసి ను విన్నర్ గా ఒప్పుకోవడం లేదు అని అంటారు.

Advertisement

ఇక వీళ్లు అలా రియాక్ట్ అవ్వడానికి కారణం లాస్యనే.. తులసి గురించి లేనిపోని మాటలు నెగిటివ్ గా చెబుతుంది. ఆ తర్వాత లక్కీ స్టమక్ పెయిన్ గా ఉంది నన్ను వాష్ రూమ్ కి తీసుకెళ్ళు అంటూ ఏడుస్తాడు. కానీ లాస్య తన బిడ్డను ఏమాత్రం పట్టించుకోదు. ఇక అనసూయ ఆవార్డు మా తులసి కి ఇచ్చి తీరాల్సిందే అంటూ విరుచుకు పడుతుంది.

ఇక తులసికి ఏం సమాధానం చెప్పాలో తెలియక.. వెళ్ళిపోయిందని కొందరు ఆరోపణలు చేస్తారు. కానీ లక్కీ ను వాష్ రూమ్ కి తీసుకొని వెళ్లి వస్తుంది. ఆ తర్వాత తులసి లాస్య కు తల్లి అనిపించుకునే అర్హత ఆమెకు లేదని అంటుంది. కొడుకును టాయిలెట్ కి తీసుకెళ్ళని విషయంలో అందరి ముందు దెప్పి పొడుస్తుంది.

అంతేకాకుండా ఆ అవార్డు తనకే.. ఇవ్వండి సంతోషపడనివ్వండి అని తులసి అంటుంది. ఆ అవార్డు తో అయినా తనని తల్లిగా నటించిన కాదు.. తల్లిగా జీవించమని చెప్పండి అని లాస్య కు బుద్ధి చెబుతుంది. ఇక అసలు విషయం తెలుసుకున్న కాంపిటేషన్ సభ్యులు తులసికే బెస్ట్ మదర్ అవార్డును ఫిక్స్ చేస్తారు.

Advertisement

ఇక ఆ అవార్డు ను తులసికి ఇవ్వడానికి డిస్టిక్ కలెక్టర్ గారు వస్తారు ఇంతకు కలెక్టర్ ఎవరంటే? ప్రవళిక. అది చూసి ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. ఇక తులసి మరో లెవెల్లో స్టన్ అవుతుంది. ప్రవళిక నోరు వెళ్ళబెట్టి చూసింది చాలు.. స్టేజ్ మీదకి వెళదామా అని తులసి తో నవ్వుకుంటూ అంటుంది.

తులసికి తన చేతుల మీదుగా ప్రవళిక అవార్డులను ఇస్తుంది. ఆ తర్వాత తులసి ఒక ఇంటర్వ్యూ కి వెళుతుంది. అక్కడ నువ్వు నందు భార్య అంటే వెంటనే జాబ్ ఇచ్చేవాడిని అని అంటారు. బిక్ష గా అయినా జాబు ఇవ్వండి కానీ.. నందగోపాల్ భార్యగా మాత్రం నాకు జాబు అవసరం లేదు అని నందు ముందే చెప్పుతో కొట్టినట్టు అంటుంది.

Advertisement
Exit mobile version