Intinti gruhalakshmi serial September 10 Today Episode : తెలుగు బుల్లి తెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో లక్కీ తులసి వాళ్ళ ఇంటికి వెళ్లడానికి డ్రస్సులు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో లక్కీ మీరు తులసి ఆంటీ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కూడా గొడవపడి అక్కడ ఉన్న వాళ్ళం మూడ్ చెడగొడతారు అని అనడంతో నందు లాస్య షాక్ అవుతారు. అప్పుడు లాస్య నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తాను కదా అని అనగా వెంటనే లక్కీ నా దారులు నాకు ఉన్నాయి. నాతో పాటు అక్కడికి హనీ కూడా వస్తుంది అని అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు లక్కీ.
ఆ తర్వాత నందు లాస్య ఇద్దరు సామ్రాట్ గురించి ఆలోచిస్తూ మళ్ళీ సామ్రాట్ అక్కడికి ఎలా వెళ్తాడు అనుకోని మనం కూడా వెళ్దాం అని వెళ్లాలని నిర్ణయించుకుంటారు. మరొకవైపు తులసి లేసి వినాయకుడి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి అనంతరం అందరినీ రేపు నిద్ర లేపుతుంది. పరంధామయ్య దంపతులకు కూడా నిద్ర లేవగానే ఇద్దరు కామెడీగా మాట్లాడుకుంటూ ఉంటారు.
ఆ తరువాత తులసి, శృతి ఇద్దరు పూలదండ కడుతూ ఉండగా అప్పుడు ప్రేమ్ కావాలనే శృతిని ఇరికించాలి అని తల తుడవమని చెప్పడంతో పక్కనే తులసి ఉండగా శృతి ఏం చేసేది లేక అక్కడికి వెళ్లి ప్రేమ్ కి తల తుడుస్తుంది. తర్వాత ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉండగా ఇంతలో అక్కడికి లక్కీ వచ్చి హడావిడి చేస్తూ ఉంటారు.
ఆ తర్వాత తులసి ఇంటికి సామ్రాట్ హనీ వాళ్ళ బాబాయ్ ముగ్గురు కార్ లో వస్తారు. అప్పుడు సామ్రాట్ థాంక్స్ నాన్నా వచ్చినందుకు లోపలికి వెళ్దాం పద అని అనగా నాకు జూమ్ మీటింగ్ ఉంది మీరు వెళ్లిన తర్వాత వస్తాను అని చెబుతాడు సామ్రాట్. ఆ తర్వాత సామ్రాట్ వాళ్ళ బాబాయ్ హనీ లోపలికి వెళ్లడంతో అందరూ ప్రేమగా పలకరిస్తారు.
Intinti gruhalakshmi serial : అసలు నిజం తెలుసుకున్న సామ్రాట్..?
ఇంతలోనే అక్కడికి నందు లాస్యలు వచ్చి ఇంటి బయటే సామ్రాట్ కార్ దగ్గర నిలబడి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు జరిగిన విషయాలు అన్నీ నందుకు చెబుతూ ఉండగా కారులోనే ఉన్న సామ్రాట్ ఆ మాటలు విని షాక్ అవుతాడు. ఆ తర్వాత నందు లాస్య వాళ్ళు ఇంట్లోకి వెళ్లడంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అప్పుడు అనసూయ వెటకారంగా మాట్లాడడంతో నందు గిల్టీ గా ఫీల్ అవుతూ ఉంటాడు.
ఇక దివ్య అయితే ఈసారి పండగ జరిగినట్లే అని టెన్షన్ పడుతూ ఉంటుంది. తులసి చేసేదేమీ లేక వారిని పూజ చేసుకోమని చెబుతుంది. ఇక రేపటి సామ్రాట్ బయట ఉన్నాడు అని తెలుసుకున్న తులసి వెళ్లి ఇంట్లోకి రమ్మని చెప్పి ఆహ్వానిస్తుంది. వారు మాట్లాడుకుంటున్న మాటలు అన్నీ నందు,లాస్య వాళ్ళు వింటూ ఉంటారు. ఆ తర్వాత సామ్రాట్ వచ్చినందుకు అందరు సంతోషపడుతూ ఉండగా అబి మాత్రం పూజలో కూర్చోవాలి అంటే మా అమ్మకు స్వారీ చెప్పాల్సిందే అని అంటాడు.
- Intinti Gruhalashmi july 2 Today Episode : భాగ్య తిక్క కుదిర్చిన తులసి..లాస్య పరిస్థితి చూసి నవ్వుకుంటున్న తులసి..?
- Intinti Gruhalakshmi Oct 15 Today Episode : ప్రేమ్ కి ముద్దు పెట్టిన శృతి.. అభి, ప్రేమ్ లతో గుంజీలు తీయిస్తున్న పరంధామయ్య..?
- Intinti Gruhalakshmi November 9 Today Episode : జరిగిన విషయం తలచుకొని బాధతో కుమిలిపోతున్న నందు.. సంతోషంలో తులసి సామ్రాట్..?
