Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

TS Drive Constable 2022: డ్రైవర్ కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేశారా… రెండు రోజులే గడువు!

TS Drive Constable 2022: తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖలో ఉన్నటువంటి వివిధ ఖాళీలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మరో రెండు రోజులలో దరఖాస్తు ప్రక్రియ గడువు ముగియనుంది.అయితే ఈ నోటిఫికేషన్ లో 100 డ్రైవర్ కానిస్టేబుల్ పోస్టులకు కూడా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి.లేదా తత్సమాన కోర్సు పూర్తిచేసి ఉండాలి. లేదా పదో తరగతి, ఐటీఐలో ఆటో ఎలక్ట్రీషియన్‌ లేదా మెకానిక్‌ మోటార్‌ లేదా మెకానిక్‌ డీజిల్‌ లేదా ఫిట్టర్‌ కోర్సు ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు డ్రైవర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండి రెండు సంవత్సరాల అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఎలాంటి ప్రిలిమ్స్ ఉండవు కానీ ప్రతి ఒక ఈవెంట్ రన్నింగ్, లాంగ్ జంప్, షాట్ పుట్ వంటి వాటిలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. వీటిలో ఉత్తీర్ణత సాధించిన వారికి 100 మార్కుల పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో పాసైన వారు మెయిల్స్ కి ఎంపిక అవుతారు. అయితే ఈ పరీక్ష పేపర్ తెలుగులో కాకుండా పూర్తిగా ఇంగ్లీష్ లోనే ఉంటుంది.మెరిట్ ఆధారంగా అభ్యర్థులను రాష్ట్రంలో ఎక్కడైనా ఉద్యోగాలకు నియమించవచ్చు. ఇప్పటి వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది.

Advertisement
Exit mobile version