Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Smart phone: అత్యంత తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్లోకి రానున్న స్మార్ట్ ఫోన్…!

Smart phone: ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు చేతిలో స్మార్ట్ ఫోన్ దర్శనమిస్తుంది. ఇలా ఒక్క నిమిషం పాటు చేతిలో సెల్ ఫోన్ లేకపోతే ఏ మాత్రం దిక్కుతోచని స్థితిలో ఉండి పోతారు అంతగా ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ కి అంకితమయ్యారు. ఇకపోతే సెల్ ఫోన్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే అత్యధిక ధర లో కొనుగోలు చేయడానికి సామాన్యులకు కష్టతరంగా మారుతుంది. కనుక సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని లావా కంపెనీ అత్యంత తక్కువ ధరకే అధునాతనమైన ఫీచర్స్ తో మార్కెట్లోకి ఫోన్ విడుదల చేయనుంది. మరి ఆ ఫోన్ ఏంటి… ఆ ఫీచర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం….

LAVA Z21 పేరుతో స్మార్ట్ ఫోన్ కేవలం 5,299 రూపాయలకే మార్కెట్లో మనకు లభించనుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫోన్ 2జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంది. బ్యాటరీ కెపాసిటీ: 3100 mAH, స్టోరేజీ: 2 GB RAM, 32 GB ROM
డిస్‌ప్లే: 5 అంగుళాలు.4జీ సపోర్ట్, 2 సిమ్స్ సపోర్ట్.
అక్టాకోర్ ప్రాసెసర్‌ కలిగిన ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ చేస్తుంది.బ్లూటూత్ సపోర్ట్, వైఫై, యూఎస్‌బి కనెక్టివిటీ ఉంది.

LAVA Z21 స్మార్ట్‌ఫోన్‌పైప్రముఖ ఈ-కామర్స్ సమస్త అమెజాన్ అదిరిపోయే ఆఫర్లను కూడా ప్రకటించింది. ఈ ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా కొనుగోలు చేసే సౌకర్యం కల్పించింది. పాత ఫోన్ ఇచ్చి ఎక్స్చేంజ్లో LAVA Z21 కొనుగోలు చేయవచ్చు. HSBC కార్డు ఉంటే 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా పొందవచ్చు. అలాగే ఈఎమ్ఐ సదుపాయం కూడా కలదు.

Advertisement
Exit mobile version