Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Viral Video: మెగాస్టార్ పాటకి స్టెప్పులు వేస్తూ ఉర్రూతలూగించిన స్కూల్ మాష్టర్.. వీడియో వైరల్!

Viral Video: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు వాడకం చాలా ఎక్కువ అయ్యింది. చిన్న చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. అందువల్ల చాలా మంది ప్రతిరోజు సోషియల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. మరికొందరు సోషియల్ మీడియా ద్వార తమలో ఉన్న టాలెంట్ మొత్తం బయట పెడుతున్నారు. టిక్ టాక్ లో కామెడీ , డాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ పాపులర్ అవుతున్నారు. ఇటీవల పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో స్కూల్ మాష్టర్ వేసిన స్టెప్పులు ఇప్పుడూ వైరల్ గా మారాయి.

ఒకప్పుడు స్కూల్ మాస్టర్ అంటే పిల్లలకి పాఠాలు చెబుతూ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. కాని ప్రస్తుతం రోజులు మారాయి. ప్రస్తుతం స్కూల్ టీచర్లు పిల్లకి చదువుతో పాటు ఇతర యాక్టివిటీస్ లో కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మాస్టర్లు కూడ తమలో దాగి ఉన్న ప్రతిభ బయటికి తీస్తూ పిల్లలకి స్ఫూర్తి గా నిలుస్తున్నారు. ఇటీవల ఒక స్కూల్ మాష్టర్ స్కూల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో తనలో ఉన్న టాలెంట్ బయట పెట్టాడు. మాష్టర్ చిరంజీవి పాటకి అదిరిపోయే స్టెప్పులు వేసాడు.

మాస్టర్ డాన్స్ చేస్తున్న సమయంలో వీడియో తీసిన ఒక వ్యక్తి దాన్ని సోషియల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మాష్టర్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసిన నెటిజన్లు మాష్టర్ చేసిన డాన్స్ కి ఫిదా అవుతూ.. స్కూల్ మాస్టర్స్ కూడ ఇలా డాన్స్ అదరగొడతరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరూ కూడ ఈ డాన్స్ వీడియో చూసి మీ కామెంట్స్ తెలపండి.

Advertisement
Exit mobile version