Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Shikhar Dhawan : ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్ పై చేయి చేసుకున్న తండ్రి.. వీడియో వైరల్!

Shikhar Dhawan : సాధారణంగా చిన్న పిల్లలు తప్పు చేస్తే వారిని సక్రమమైన దారిలో పెట్టడం కోసం తల్లిదండ్రులు కొన్నిసార్లు వారిపై చేయి చేసుకోవడం మనం చూస్తుంటాము. అయితే కొడుకు పెద్దవాడైన తర్వాత ఏ తండ్రి చెయ్యి చేసుకోడు. కానీ ఇండియన్ క్రికెటర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న శిఖర్ ధావన్ పై తన తండ్రి చేయి చేసుకోవడమే కాకుండా ఏకంగా కిందపడేసి మరీ కాళ్లు, చేతులతో కుమ్మిపడేశారు. ఇంట్లో నుంచి వెళ్లగొట్టినంత పనిచేశారు. తన కుటుంబ సభ్యులు తన తండ్రిని ఎంత ఆపడానికి ప్రయత్నించిన ఆయన మాత్రం తన కొడుకును దారుణంగా కొట్టారు.

Shikhar Dhawan

ఈ విధంగా శిఖర్ ధావన్ తన తండ్రి చేయి చేసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..ఐపీఎల్ 2022 నుంచి పంజాబ్ కింగ్స్ నిష్క్రమించినందుకు తన తండ్రి ఆగ్రహంతో ఈ పని చేశారని తెలుస్తోంది. అయితే పంజాబ్ కింగ్స్ నిష్క్రమించినందుకు శిఖర్ ధావన్ ని కొట్టడం ఎందుకు అని ఆలోచిస్తున్నారా…పంజాబ్ కింగ్స్ టోర్నీ నుంచి తప్పుకోవడంతో అభిమానులు ఎంతో నిరాశతో ఉన్నారు ఈ క్రమంలోనే వారిని ఉత్సాహపరచడం కోసం వీరందరూ కలిసి ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ క్రమంలోనే అభిమానులను నవ్వించే ప్రయత్నంలో భాగంగా శిఖర్ ధావన్ కుటుంబ సభ్యులు కలిసి సరదాగా ఈ వీడియోని చేశారు.ఇక ఈ వీడియోని శిఖర్ ధావన్ ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ప్లే ఆఫ్స్‌కి చేరకపోవడంతో మా నాన్న గెంటేశాడు అని వీడియోకి ట్యాగ్ ఇచ్చాడు. అయితే ఇలాంటి సరదా, ఫన్నీ వీడియోలు చేయడం శిఖర్ ధావన్ కి కొత్తేమీ కాదు ఇదివరకే ఇలాంటి ఎన్నో వీడియోలను చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Also : Oo antava mava: ఊ అంటావా మావా సాంగ్ క్రేజ్ మామూలుగా లేదుగా.. అమెరిక్ వీధుల్లో కూడా అదే పాట

Advertisement
Exit mobile version