Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Karthika Deepam june 25 Today Episode : జ్వాలాకి గోరుముద్దలు తినిపించిన సౌందర్య.. సౌర్యని తలచుకొని బాధ పడుతున్న సౌందర్య..?

Karthika Deepam june 25 Today Episode : తెలుగు బుల్లితెర పై కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్వాలా ఇంట్లో సౌందర్య వంట చేస్తూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో జ్వాలా కోసం సౌందర్య ఆ దోసకాయ పచ్చడి చేస్తాను అని అనగా నాకు దోసకాయ పచ్చడి అంటే ఇష్టం ఉండదు అని అంటుంది. ఆ తర్వాత సౌందర్య స్వయంగా భోజనం కలిపి జ్వాలాకి గోరుముద్దలు పెట్టగా అప్పుడు జ్వాలా లోపల సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు జ్వాలా తన గతాన్ని జరిగిన విషయాలను తలుచుకొని బాధపడుతూ ఉండగా సౌందర్య కూడా బాధపడుతుంది.

Karthika Deepam june 25 Today Episode

అప్పుడు జ్వాలాకి ధైర్యం చెబుతూ జ్వాలాను బాధ పడవద్దు అని చెబుతుంది. ఆ తర్వాత సౌందర్య అక్కడి నుంచి ఇంటికి వెళుతూ ఉండగా ఇంతలో శోభ ఫోన్ చేయగా అప్పుడు వెంటనే సౌందర్య నువ్వు ఎక్కడ ఉన్నావో లొకేషన్ పంపించు నేనే వస్తాను అని అంటుంది. దాంతో శోభ అసలు విషయం తెలీక సంతోష పడుతూ ఉంటుంది.

Advertisement

మరొకవైపు ప్రేమ్, హిమ గురించి తలుచుకుని బాధ పడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి నిరుపమ్ వస్తాడు. ఏంటి ప్రేమ్ నువ్వు నా పెళ్ళికి ఉండకుండా ముంబైకి వెళ్లి పోతున్నావా.. వెళ్లొద్దు ప్రేమ్ అని అనడంతో సరే అని నిరుపమ్ ని బాధతో కౌగిలించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు సౌందర్య కోసం శోభ ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే సౌందర్య అక్కడికి రావడంతో తన డీల్ గురించి మాట్లాడుతుంది.

అప్పుడు సౌందర్య శోభ చెంప చెల్లు మనిపిస్తుంది. ఇంకొక్కసారి నా జోలికి కానీ నా మనవడు మనవరాలు జోలికి ఫ్యామిలీ జోలికి వచ్చావు అంటే నీ చాప్టర్ క్లోజ్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మరొకవైపు హిమ రోడ్డుపై ఒంటరిగా నిలుచొని జ్వాలా గురించి ఆలోచిస్తూ జ్వాలాకి ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకోవాలని అని ఆలోచిస్తూ ఉంటుంది.

ఇంతలోనే శోభా అటుగా వెళుతూ హిమ ను చూసి ఎలా అయినా హిమ పని పట్టాలి అనుకొని జ్వాలా కి ఫోన్ చేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడి హిమ ఉన్న ప్రదేశానికి రమ్మని చెబుతుంది. మరొకవైపు సౌందర్య ఆనందరావు లు సౌర్య గురించి తలచుకుని బాధ పడుతూ ఉంటారు. అప్పుడు ఆనందరావు నా మనవరాలిని కలిసి హత్తుకొని ఎందుకు వెళ్ళిపోయావు అని అడగాలని ఉంది అని అనుకుంటూ ఉంటారు. ఇక రేపటి ఎపిసోడ్ లో జ్వాలా ఆటో ని తీసుకొని నిరుపమ్ ఇంటికి వెళ్తుంది.

Advertisement

అప్పుడు స్వప్న ఏంటి సరాసరి ఇంట్లోకి వచ్చావు అని అనగా కొన్ని లెక్కలు తేలాలి అని చెప్పి ఆటో కీస్ ని నిరుపమ్ చేతిలో పెట్టి ఎమోషనల్ గా మాట్లాడింది దండం పెట్టి అక్కడ నుంచి వెళ్లి పోతుంది జ్వాలా. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Karthika Deepam june 24 Today Episode : హిమని అడ్డంగా బుక్ చేసిన శోభ.. కోపంతో రగిలిపోతున్న జ్వాలా..?

Advertisement
Exit mobile version