Sitara Mahesh Babu Pics : సూపర్ స్టార్ మహేష్ బాబు గారలపట్టి సితార (Sitara) గట్టమనేనికి ఫాలోయింగ్ మాములుగా లేదు. సితార సోషల్ మీడియాలో ఏం చేసినా అది సెన్సేషనే.. మహేశ్ బాబు, నమ్రత కూడా తన ఫ్యామిలీకి సంబంధించిన పలు అంశాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. ఇటీవల సితార కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు ఆసక్తికరమైన పోస్టులను పెడుతోంది. తాను ఎవరితో ఫైటింగ్ చేస్తున్న ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేసింది సితార..
ఇంతకీ ఆ ఫొటోలో సరదాగా పొట్లాడుతున్న వ్యక్తిని గుర్తుపట్టారా? చూస్తుంటే సితార అన్నయ్య గౌతమ్ లానే ఉన్నడని అనుకుంటున్నారా? మరోసారి ఫొటోలను దగ్గరగా పరిశీలించండి.. అతడు ఎవరో గుర్తుపట్టారా? సితార పోస్టు చేసిన ఈ పిక్స్ చూసిన నెటిజన్లు కూడా అయోమయంలో పడ్డారు.
Sitara Mahesh babu Pics : సితార ఫైట్ చేసేది ఎవరోతోనంటే..?
ఇంతకీ అతడు మహేశ్ లేదా గౌతమ్ అనేది తెలియడం లేదు. చాలా యంగ్ లా కనిపిస్తున్నాడని చూస్తుంటే గౌతమ్ లానే ఉన్నాడని అనుకున్నారంతా.. కానీ, మరో ఫొటోలో గౌతమ్ కూడా కనిపించాడు.. అంటే సితార ఫైట్ చేస్తున్న వ్యక్తి ఎవరో కాదు.. తండ్రి మహేశ్… వయస్సు పెరిగినా ఇప్పటికీ నిత్య యవ్వనంగా మహేశ్ కనిపిస్తున్నారు. కొడుకు గౌతమ్ కంటే చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మహేశ్ ముఖం కనిపించకపోయినప్పటికీ.. సితార సరదాగా ఫైటింగ్ చేసింది మాత్రం తండ్రి మహేశ్ తోనే.. తండ్రితో సరదాగా ఆడుతున్న ఫొటో నెటిజన్లను ఆకట్టకుంటోది.. తండ్రికూతుళ్ల ఫైట్ సీన్ అదిరింది అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. తన ప్రొఫెషన్ సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఎక్కువగా ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇస్తాడు మహేశ్.. తన ఫ్యామిలీలో అధిక సమయం గడిపేందుకు ఇష్టపడతాడు. సితార తన ఇన్ స్టాలో పోస్టు చేసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also : Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్.. తనను బాయ్ ఫ్రెండ్ అందుకే వదిలేశాడంట..!