Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Karthika Deepam : జ్వాలా,నిరుపమ్ ని కలుపుతాను అన్న హిమ.. కోపంతో రగిలి పోతున్న శోభ..?

Karthika Deepam MAY 21 Today Episode: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నిరుపమ్, హిమ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండడంతో స్వప్న ధైర్యం చెబుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో స్వప్న,నిరుపమ్ తో మాట్లాడుతూ స్వచ్ఛ ప్రేమ వ్యవహారం గురించి చెబుతూ ఉంటుంది. పెళ్లికి ముందే మీ నాన్న వేరే వాళ్లను ప్రేమించాడు, అంతేకాకుండా మీ నాన్నతోనే ఆ అమ్మాయి ఇద్దరు పిల్లలను కూడా కనింది అని నిరుపమ్ తో చెబుతుంది.

Karthika Deepam MAY 21 Today Episode

ఇలా మీ డాడీ నన్ను మోసం చేశాడు కాబట్టే నేను దూరంగా పెట్టాను అని స్వప్న మనసులో బాధ పడుతుంది. మరొకవైపు నానమ్మ, సౌర్య కలుసుకోలేదు అని హిమ ఊపిరి పీల్చుకుంటుంది. హిమ, జ్వాలా ఇద్దరూ కారులో వెళ్తూ ఉండగా రోడ్డు మధ్యలో కారు ఆగిపోతుంది.

Advertisement

ఇంతలో అక్కడికి శోభా అనే అమ్మాయి వచ్చి కారు రోడ్డుకు అడ్డంగా పెడతారా అని కోపంగా హిమ చంప పగలగొడుతుంది. దానితో జ్వాలా కోపం వచ్చి రెండు సార్లు కొట్టి బుద్ధి చెబుతుంది. అప్పుడు ఆ అమ్మాయి మీ సంగతి చూస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

ఆ తర్వాత స్వప్న శోభకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెబుతుంది. ఆ తరువాత జ్వాలా తాను నిరుపమ్ ని ప్రేమిస్తున్నట్లుగా హిమతో చెబుతుంది. అప్పుడు హిమ నిన్ను బావను కలపడం కోసమే నేను కూడా టెన్షన్ పడుతున్నాను అని మనసులో అనుకుంటుంది.

అప్పుడు జ్వాలా నీకు ఎప్పుడూ డాక్టర్ సాబ్ నీ పెళ్లి చేసుకోవాలి అని అనిపించలేదా అని అడగగా నాకు డాక్టర్ సాబ్ నచ్చలేదు అని హిమ అంటుంది. అప్పుడు జ్వాలా నా మనసు నిండా డాక్టర్ సాబే ఉన్నాడు తనే నా ప్రాణం అని హిమతో అంటుంది. అలా వారిద్దరూ కాసేపు నిరుపమ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Read Also : Karthika Deepam: సౌర్య కోసం వెతుకుతున్న సౌందర్య.. విలన్ క్యారెక్టర్ ని చెంప చెల్లుమనిపించిన జ్వాలా..?

Exit mobile version