Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Intinti Gruhalakshmi serial Oct 12 Today Episode : అందరిలో నందు పరువు తీసేసిన తులసి.. సంతోషంలో సామ్రాట్..?

Intinti Gruhalakshmi serial Oct 12 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి హారతి ఇవ్వడానికి కొందరు మహిళలు ఒప్పుకోరు. ఈరోజు ఎపిసోడ్లో కాలనీవాసులు అందరూ తులసి సామ్రాట్ల బంధాన్ని తప్పుగా అపార్థం చేసుకుని తిడుతూ ఉంటారు. అప్పుడు అనసూయని తిడుతూ ఏమమ్మా అనసూయ ఎప్పుడు పక్కింటి వాళ్ళ గురించి కాదు నీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియడం లేదా అని అంటారు. మరి టిఫిన్ చేసిన ఆడది అందరి ముందే మగాడితో దాండియా ఆడుతోంది ఏమాత్రం భయం లేకుండా అని నోటికి వచ్చిన విధంగా వాగుతూ ఉంటారు.

samrat get happy in todays intinti gruhalakshmi serial episode

అప్పుడు అనసూయ వారిపై సీరియస్ అవ్వగా వాళ్ళు మాత్రం మా మీద కాదు ముందు మీ ఇంట్లో పరిస్థితులు సక్కదిద్దుకో అని అంటారు. అప్పుడు అనసూయ తులసి మీద కోప్పడుతూ నీ వల్లే ఇదంతా వచ్చింది నిన్ను సామ్రాట్ తో తిరగవద్దు అని చిలక్క చెప్పినట్టు చెప్పాను కదా నువ్వు విన్నావా అని అందరి ముందు అరుస్తుంది. సామ్రాట్ కూడా నేను చెప్పినప్పుడు నీకు ఉద్యోగం మాన్పిస్తాను కలవకుండా ఉంటాను అని చెప్పాడు అని అనడంతో వెంటనే తులసి ఆశ్చర్యపోయి మీరు సామ్రాట్ గారికీ నన్ను ఉద్యోగం మానిపించమని సామ్రాట్ గారికి చెప్పారా అనడంతో అవును అని అంటుంది అనసూయ.

ఇంటికి పెద్దగా నేను ఏది చెబితే అది వినాలి ఇకపై సామ్రాట్ ని కలవకూడదు అని గట్టిగా అనసూయ చెప్పడంతో వెంటనే జోక్యం చేసుకొని అసలు వీళ్ళందరూ గారి గురించి అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు ఆడవాళ్ళలో ఆడవాళ్ళకే ఈ విధంగా ఈర్షలు ఉంటాయి అంటే నేను నమ్మడం లేదు. అని మిమ్మల్ని చూసిన తర్వాత నమ్ముతున్నాను. సామ్రాట్ నేనే తులసి గారికి కేవలం స్నేహితులు మాత్రమే అని గట్టిగా చెబుతాడు.

Advertisement
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

ఇంటింటి గృహలక్ష్మి అక్టోబర్ 12 ఈరోజు ఎపిసోడ్ :  సంతోషంలో సామ్రాట్..

అప్పుడు తులసి కూడా నా కోసం ఆయన ఇన్ని మాటలు పడుతున్నాడు ఆయన తలుచుకుంటే ఇప్పటికి ఇప్పుడు ఈ కాలనీ అంతటిని నాశనం చేయగల స్థాయి ఆయనకు ఉంది అని గట్టిగా చెబుతుంది. అప్పుడు అనసూయ ఆడ మగ మద్య స్నేహాలు అనేవి ఉండవు. అమెరికాలో సాగుతాయి ఇక్కడ సాగవు అని అంటుంది. సామ్రాట్,అనసూయ కి తగిన విధంగా బుద్ది చెప్తాడు.

ఇప్పుడు తులసి కోపంతో మాట్లాడుతూ కాలనీలో ఇటువంటివన్నీ సహించరా ఇవన్నీ ఎప్పుడు మొదలయ్యాయి. అప్పుడు నందగోపాల్ గారు లాస్యని అర్ధరాత్రి ఇంటికి తీసుకొని వచ్చి ఒకే మంచంలో పడుకునే వారు, షికార్లు తిరిగేవారు అప్పుడు అనిపించలేదా అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు అని గట్టిగా నిలదీస్తుంది తులసి. ఉంచుకున్న మగవాళ్ళది తప్పు కాదు కానీ ఆడవాళ్లు స్నేహం చేస్తే తప్ప అని నిలదీస్తుంది.

ఇప్పుడు కాలనీవాసులు ఏంటి అనసూయ అంటూ అనసూయ అని తిడుతూ ఉండగా అప్పుడు తులసి మీరు మీ కోడలికి సరైన అత్త నా కాదా అని వెళ్లి చూసుకోండి. కోడల్ని ప్రతి పండక్కి పుట్టింటికి పంపించి ఎక్కువ డబ్బు తీసుకొని రమ్మని బలవంతం పెడుతూనే ఉంటారు. పోనీ ఇంట్లో అయినా కూడలి సరిగ్గా చూసుకుంటారు అంతే అది కూడా లేదు.

Advertisement
IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

నా మాజీ భర్త నంద గోపాల్ గారు ఇచ్చే విలువ కన్నా నా పెద్ద కొడుకు అభి ఇచ్చే విలువ కన్నా సామ్రాట్ గారు ఇచ్చే విలువ గౌరవం స్నేహం ఎక్కువ అని అంటుంది తులసి. మా బంధం మీద నాకు ఆయనకు పూర్తిగా నమ్మకం ఉంది ఎవరు ఎన్ని అనుకున్న పర్లేదు అని చెప్పి కోపంగా అక్కడినుంచి వెళ్ళిపోతుంది తులసి. ఆ తరువాత సామ్రాట్ జరిగిన విషయాన్ని తలుచుకొని ఆనంద పడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ బాబాయ్ అక్కడికి రావడంతో తులసి గురించి గొప్పగా పొగుడుతూ ఆనందపడుతూ ఉంటాడు సామ్రాట్.

Read Also : Intinti Gruhalakshmi: మళ్లీ దగ్గరవుతున్న సామ్రాట్ తులసి.. కోపంతో రగిలిపోతున్న అనసూయ..?

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version