Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Devatha july 2 Today Episode : దేవుడమ్మ ఇంటికి వెళ్లిన భాగ్యమ్మ.. సంతోషంలో కమల..?

Devatha july 2 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రాధా పిల్లలతో ఆదిత్య గురించి మాట్లాడుతూ పొరపాటున నోరు జారీ ఆ తర్వాత పిల్లలకు సర్ది చెబుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో భాగ్యమ్మ స్కూల్లో పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉండగా. ఇంతలో పిల్లల కనిపించడంతో వారిని పిలుస్తుంది. అప్పుడు దేవి నిన్న నేను అమ్మమ్మకు 500 రూపాయలు ఇచ్చాను అవి అలాగే ఉన్నాయి వాటితో ఏమైనా కొనుకుందాం కదా అని చిన్మయిని తీసుకుని వెళుతుంది. అప్పుడు భాగ్యమ్మ దగ్గర లేకపోవడంతో చిల్లర కోసం మరొక చోటికి వెళ్తూ ఉంటుంది.

Devatha july 2 Today Episode

దారిలో వెళ్తూ ఉండగా ఇంతలో ఒక కారు వేగంగా రావడంతో పక్కకు జరుగుతుంది. అప్పుడు భాగ్యమ్మ ఆ కారు వ్యక్తిని నోటికి వచ్చిన విధంగా తిడుతూ ఉండగా ఇంతలో దేవుడమ్మ కారు దిగడంతో క్షమించమని కోరుతుంది. అప్పుడు దేవుడమ్మ అవన్నీ కాదు మన రుక్మిణి బతికే ఉందని అనడంతో అప్పుడే రుక్మిణి పిల్లల కోసం స్కూల్ దగ్గరికి వస్తుంది.

Advertisement

దేవుడమ్మ వెనకాలే రుక్మిణి ఉండడంతో ఎక్కడ దేవుడమ్మ రుక్మిణి చూస్తుంది అన్న భయం భయంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు దేవుడమ్మ ఇంటికి వెళ్దాం పద భాగ్యమ్మ అని అడగగా మొదటి రాను అని చెబుతుంది. ఆ తర్వాత భాగ్యమ్మ ఎక్కడ రుక్మిణిని,దేవుడమ్మ చూస్తుందో అన్న భయంతో పక్కకు పిలుచుకొని వెళ్తుంది. ఇక మరొకవైపు రాధ ఇంటికి పిల్లల్ని తీసుకొని వెళ్ళగా అక్కడ మాధవ కనిపించడంతో పిల్లలు మాధవ దగ్గరికి పరుగులు తీస్తారు.

అప్పుడు మాధవ దేవి నీకు ఒక సర్ప్రైస్ అంటూ తన ఫోటోని చూపించడంతో వెంటనే రాధ తన దగ్గర కూడా ఒక సర్ప్రైజ్ ఉంది అని దేవి ఆదిత్యతో కలిసి దిగిన ఫోటోని చూపించడంతో ఆ దేవి ఆ ఫోటోని చూసి సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు మాధవ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు మాధవ మరొక గిఫ్ట్ అంటూ ట్యూబ్ తీసుకొని వస్తాడు.

అప్పుడు చదువుకునే పిల్లలకు ఇటువంటి గేమ్స్ అలవాటు చేయొద్దు వేరే ఆటలు వాడాలి అని అంటుంది. ఇంతలో పిల్లలు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో రాధ,మాధవకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. మరొకవైపు దేవుడమ్మ, భాగ్యమ్మను ఇంటికి తీసుకొని వెళ్లడంతో అక్కడ సత్య భాగ్యమ్మ ని సంతోషంగా పలకరిస్తుంది. ఇంతలోనే అక్కడికి భాషా కమల ఇద్దరూ రావడంతో వాళ్ల దగ్గర నుంచి దూరంగా వెళుతుంది భాగ్యమ్మ.

Advertisement

అప్పుడు కమల భాగ్యమ్మతో ఏం జరిగింది అని అని అడుగుతూ రుక్మిణి బతికే ఉన్న విషయాన్ని పదేపదే అడుగుతూ ఉంటుంది. మరొకవైపు దేవి తన అవ్వ తాతలకు సరదాగా మాట్లాడుతూ ఉండగా అప్పుడే మాధవ రావడంతో, మాధవ చేతి పై ఉన్న పచ్చబొట్టును చూసి దేవి దీనిని ఎలా రాస్తారు అని అడగగా అనడంతో దాని గురించి వివరిస్తూ ఉంటాడు మాధవ..

Read Also : Devatha july 1 Today Episode : దేవి మాటలను తలుచుకొని ఆనందపడుతున్న ఆదిత్య..రాధ మాటలకు షాక్ అయిన దేవి,చిన్మయి.?

Advertisement
Exit mobile version