Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Guppedantha Manasu November 22 Today Episode : గౌతమ్ పై సీరియస్ అయిన దేవయాని.. మహేంద్రను బ్రతిమలాడుతున్న రిషి?

Guppedantha Manasu November 22 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మహేంద్ర ఫణీంద్ర, రిషి ని స్టేజ్ పైకి పిలుస్తుంది జగతి.

ఈ రోజు ఎపిసోడ్ లో ఫణీంద్ర శాలువా కప్పి వసు అభినందిస్తాడు. ఆ తర్వాత మహేంద్ర కంగ్రాట్యులేషన్స్ చెప్పగా వెంటనే రిషి వసు మెడలో పూలదండ వేసి అభినందిస్తాడు. అందరూ చెప్పట్లతో వసుని అభినందిస్తూ ఉండడంతో అది చూసిన రిషి సంతోషపడతాడు. ఆ తరువాత జగతి మీరు ఇంటర్వ్యూ మొదలుపెట్టండి అని ఇంటర్వ్యూ వాళ్లకు చెప్పగా వెంటనే వసు నాదొక చిన్న రిక్వెస్ట్ నాకు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నా గురువులు అయినా రిషి సార్ అలాగే జగతి మేడం నా పక్కన ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అంటుంది.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!
Guppedantha Manasu November 22 Today Episode

ఆ తర్వాత ఇంటర్వ్యూ మొదలవడంతో అప్పుడు విలేకర్ మీరు యూనివర్సిటీ టాపర్ అవుతారని ముందు అనుకున్నారా అని ప్రశ్నించగా నేను కాదు నా మీద నాకంటే మా మేడం కి సార్ కి ఎక్కువగా నమ్మకం ఉంది అని అంటుంది వసుధార. నాకు ధైర్యం ఇచ్చింది జగతి మేడం అయితే నన్ను వెనకుండి నడిపింది రిషి సార్ అని అనడంతో అందరూ ఒక్కసారిగా చెప్పట్లతో అభినందిస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ అయిపోవడంతో ఇంతలో గౌతమ్ అక్కడికి వచ్చి అందరితో కలిసి సెల్ఫీలు దిగుదాం అని అంటాడు. అందరూ సెల్ఫీలు దిగుతూ ఉండగా మహేంద్ర అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు.

Advertisement

ఇంతలో రిషి ఎక్కడికి వెళ్తున్నారు డాడ్ అనడంతో ఇంతలో అక్కడికి మీడియా కెమెరామెన్ వచ్చి రిషి తో మాట్లాడుతూ ఉంటాడు. జరిగిన విషయం గురించి బాధపడుతున్నాను సార్ అని రిషి తో మాట్లాడుతూ ఉండగా మహేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జగతి అక్కడికి వస్తుంది. మేడం మీరే డాడ్ ని జాగ్రత్తగా చూసుకోవాలి. డాడ్ నా దగ్గరే ఉండాలి మన ఇంట్లోనే ఉండాలి అందుకోసం మీరు నాకు హెల్ప్ చేయాలి అనడంతో జగతి సరే అని అంటుంది. డాడ్ వెళ్ళిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను మేడం అని ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉండగా ఇంతలో పుష్ప అలాగే స్టూడెంట్స్ అందరూ వచ్చి రిషి తో సెల్ఫీలు దిగుతూ ఉండగా ఇంతలో జగతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

Guppedantha Manasu నవంబర్ 22 ఎపిసోడ్ : మహేంద్రను బ్రతిమలాడుతున్న రిషి..

ఆ తర్వాత జగతి కారు దగ్గరికి వెళ్లగా మహేంద్ర మనం ఖచ్చితంగా వెళ్లాల్సిందేనా ఇంకొకసారి ఆలోచించు అనడంతో తప్పదు జగతి అని కారు ఎక్కబోతూ ఉండగా రిషి వచ్చి నేను మీతో కొంచెం మాట్లాడాలి డాడ్ అని అంటాడు. మరొకవైపు ఫణీంద్ర కాలేజీలో జరిగిన విషయం గురించి చెబుతూ ఉండగా తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు గౌతం పెదనాన్న రిషి వసుధారలు చనువుగా ఉండడం చూసి ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నాడు అంటూ దేవయాని ని ఉద్దేశించి మాట్లాడతాడు గౌతమ్.

ఇదంత ఎవరు చేశారో తెలుసుకోవాలి పెదనాన్న అని అనడంతో దేవయాని తన పేరు ఎక్కడ బయట పడుతుందో అని గౌతమ్ ఈ టాపిక్ ఇంతటితో వదిలేస్తావా లేదా అని సీరియస్ అవుతుంది. మరొకవైపు రిషి మహేంద్ర తో ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు రిషి డాడ్ నన్ను విడిచి వెళ్లిపోవద్దండి డాడీ ప్లీజ్ ఇప్పటికే నేను చాలా బాధపడ్డాను ఇక నాకు ఓపిక లేదు అని అంటాడు. ఇక్కడ వరకు వచ్చిన మీరు నాతో పాటు ఇంటికి వస్తారని నేను అనుకున్నాను కానీ మళ్ళీ వెళ్ళిపోవాలి అనుకుంటున్నారా అని అంటాడు రిషి. అప్పుడు మహేంద్ర రిషి మాటలు వినిపించుకోకుండా వెళ్ళిపోవాలి అనడంతో నాకు మీరు తప్ప ఎవరు ఉన్నారు డాడ్ అని అంటాడు రిషి. అప్పుడు జగతి వసుధారలు ఆ మాటలు విని బాధపడుతూ ఉంటారు.

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?

Read Also : Guppedantha Manasu: రిషి,వసు లను కాపాడిన మహేంద్ర..సంతోషంలో జగతి.?

Advertisement
Exit mobile version