Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి ప్రేమకథ నేపథ్యంలో కొనసాగుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే వసు మీరు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా.. స్కాలర్ షిప్ కాంపిటీషన్ లో మంచి మార్కులు వస్తాయి అని రిషి తో అంటుంది. ఇక రిషి ఇలాంటప్పుడే వసు మనసులో నా స్థానం ఏమిటో తెలుసుకోవాలి అని అనుకుంటాడు.
ఆ తర్వాత సాక్షి రిషికి ఫోన్ చేయగా రిషి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక రిషి సాక్షి కి నేను ఇష్టం లేదని చెప్పినా.. ఎందుకు నా వెంట పడుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఈ విషయం గురించి వసుకు చెప్పేయాలని ఫిక్స్ అవుతాడు. ఇక ఈ విషయం చెప్పడానికి వసును రిషి ఒక దగ్గరికి తీసుకుని వెళతాడు.
ఇక రిషి వసు ను ఒక హెల్ప్ అడుగుతాడు అదేమిటంటే? నా అ ఇష్టాన్ని నా నుంచి దూరం చేయడానికి నువ్వు సహాయం చేస్తావా అని అడుగుతాడు. వసు కూడా ఏ మాత్రం ఆలోచించకుండా నేను మీకు సపోర్ట్ చేస్తాను సార్ అని అంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆనందంగా చాక్లెట్ లు తింటారు.
మరోవైపు వసు ఇంటికి వెళ్లిన మహేంద్ర దంపతులు అక్కడ ఒక లవ్ లెటర్ చూస్తారు. ఆ లెటర్ చదివిన మహేంద్ర దంపతులు వీళ్ళు ఇద్దరు తోడు దొంగలు లా ఉన్నారంటూ నవ్వుకుంటూ ఉంటారు. అక్రమంలోనే వీళ్లిద్దరు రిషి గీసిన వసు బొమ్మను కూడా చూస్తారు. ఈలోగా అక్కడకు వసు వచ్చి అది నాకు గౌతమ్ సార్ ఇచ్చారు అని చెబుతుంది.
ఆ తర్వాత మహేంద్ర రిషి ఏంటో అన్నీ మనసులోనే దాచుకుంటాడు. ఆ అలవాటు నీకు కూడా వచ్చింది అని వసును కొంటెగా అంటాడు. ఇక జగతి నీకు ఒక గిఫ్టు పంపుతాను వివరాలు ఏమీ అడగకు అని వసుతో అంటుంది. ఇక రిషి దగ్గర ఉన్న లెటర్ ను జగతి వసుకు వాట్సప్ చేస్తుంది.
ఇక తరువాయి భాగం లో వసు బొమ్మను తన ఇంటికి ట్యూషన్ కోసం వచ్చే పిల్లవాడు బయటకు తీసుకు వెళ్లి ఆకతాయితనం గా అందరికీ చూపిస్తాడు. ఈ క్రమంలో ఆ బొమ్మ రెండు ముక్కలు అవుతుంది. దాంతో వసు ఎంతో ఎమోషనల్ అవుతుంది. ఈ క్రమంలో అక్కడి కి రిషి కూడా వస్తాడు. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.
- Guppedantha Manasu : మహేంద్ర చేసిన పనికి జగతిపై విరుచుకుపడ్డ రిషి..?
- Guppedantha Manasu serial Oct 17 Today Episode : మళ్లీ దగ్గరైన వసు,రిషి.. దేవయానిలో మార్పును చూసి భయపడుతున్న ధరణి..?
- Guppedantha Manasu serial Sep 14 Today Episode : దగ్గరవుతున్న జగతి,రిషి.. ఎమోషనల్ అయిన జగతి.. కోపంతో రగిలిపోతున్న దేవయాని?
