Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Guppedantha Manasu january 07 Today Episode : రాజీవ్ నిజస్వరూపాన్ని తెలుసుకున్న చక్రపాణి.. సుమిత్ర ప్రాణాలు కాపాడిన రిషి?

Guppedantha Manasu january 07 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో వసుధార దేవయానికి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తుంది.

ఈ రోజు ఎపిసోడ్ లో ఒకవైపు రిషి ఎక్కడో మంచం మీద పడుకొని వసుధార గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా మరొకవైపు వసుధార జైల్లో కూర్చుని రిషి ని తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. ఒక డాబా దగ్గర పడుకున్న రిషి వసుధార గతంలో అన్న మాటలు ఇప్పుడు అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. మరోవైపు వసుధర తాళిబొట్టు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రిషి గతంలో వసుధార అన్న మాటలు అన్ని తలచుకొని బాధపడుతూ ఉంటాడు. బంధం అనకుంటే భ్రమ అవుతోంది నువ్వేమో జైల్లో ఉన్నావు మీ అమ్మానాన్నలు హాస్పిటల్ లో ఉన్నారు అయినా నువ్వు వెళ్ళమంటే వెళ్తానని అనుకున్నావా అనుకుంటూ ఉంటాడు రిషి.

Guppedantha Manasu january 07 Today Episode

ఎప్పటికీ రిషిధారలు విడిపోరు. నేను విడిపోనివ్వను అని అక్కడి నుంచి హాస్పిటల్ కి బయలుదేరుతారు. మరొకవైపు హాస్పిటల్ లో చక్రపాణి,సుమిత్ర చికిత్స తీసుకుంటుండగా ఇంతలోనే రాజీవ్ అక్కడికి వస్తాడు. అప్పుడు వారిద్దరిని చూసి సంతోష పడుతూ ఉంటాడు రాజీవ్. అప్పుడు రాజీవ్ చక్రపాణితో మాట్లాడుతూ నాకు మీ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ నాకు ప్రాబ్లం ఉన్నది అత్తయ్య గారితోనే అత్తయ్య గారి నాకు పెద్ద ప్రాబ్లం అనుకుంటూ సుమిత్ర దగ్గరికి వెళ్తాడు. అప్పుడు సుమిత్ర ముక్కుకి ఉన్న ఆక్సిజన్ మాస్క్ తీసేయడంతో సుమిత్ర ఊపిరిఆడక అల్లాడుతూ ఉంటుంది.

Advertisement

ఇప్పుడు సుమిత్ర మాస్క్ తీసేసి నవ్వుకుంటూ బయటికి వెళ్లిపోతాడు రాజీవ్. ఇంతలోనే రిషి అక్కడికి వచ్చి సుమిత్ర ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా పరిగెత్తుకుంటూ వెళ్లి సుమిత్రకు మాస్కుని పెట్టి డాక్టర్ని పిలుస్తాడు. అదంతా కూడా మెలుకులో ఉండి చూసిన చక్రపాణి రాజీవ్ బుద్ధిని అసలు నిజ స్వరూపాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు వసుధార రిషి గురించి చెప్పిన మాటలు తలుచుకొని రిషి ని చూసి కన్నీళ్లు పెడతాడు రాజీవ్. అప్పుడు రిషి డాక్టర్లతో సుమిత్ర హెల్త్ గురించి మాట్లాడుతూ ఉండగా ఇంతలో రాజీవ్ అక్కడికి వచ్చే డాక్టర్లకు లేనిపోని విషయాలు అన్ని చెప్పి రిషి ని అక్కడినుంచి వెళ్లిపోమని చెబుతాడు.

ఆ తర్వాత లాడ్జిలో జగతి మహేంద్ర ఒక చోట కింద కూర్చొని జరిగిన విషయాలు తలుచుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. ఏంటి జగతి ఇది ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు అంతా అయోమయంగా ఉంది అని బాధపడుతూ మాట్లాడుతాడు మహేంద్ర. అప్పుడు జగతి ఒకసారి రిషి కి ఫోన్ చెయ్ మహేంద్ర అనడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు జగతి అని అంటాడు మహేంద్ర. ఇప్పుడు జగతి మహేంద్ర నువ్వే ఇలా అయిపోతే రిషికీ ధైర్యాన్ని ఎవరు చెబుతారు చెప్పు అనడంతో రిషి ఇంత బాధని తట్టుకోలేడు జగతి అని బాధపడుతూ ఉంటాడు మహేంద్ర.

రిషి ఒకవేళ ఇంటికి వెళ్లి ఉంటాడేమో మనం ఇక్కడ ఉన్న చేసేదేమీ లేదు వెళ్దాం పద జగతి అని ఇంటికి బయలుదేరుతారు. మరొకవైపు ఒక చోటికి వెళ్లి రిషి పదేపదే వసుధార అన్న మాట తలుచుకొని గట్టిగా ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. ఎన్ని అందమైన మాటలు చెప్పావు వసుధార. మరి అలాంటిది ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు వసుధార జైల్లో రిషిదారలో ఉండాల్సిన మేము వేరువేరు పరిస్థితి ఎందుకు వచ్చింది అర్థం కావడం లేదు అని ఏడుస్తూ ఉంటుంది.

Advertisement

ఈ వసుధారానీ క్షమించండి సార్ అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత జగతి మహేంద్ర ఇద్దరి ఇంటికి వెళ్తారు. అప్పుడు లోపలికీ వెళ్ళి రిషి అని అరుస్తుండగా ఏమైంది చిన్న అత్తయ్య అని ధరణి అక్కడికి రావడంతో, రిషి వచ్చాడా ధరణి అని అడగగా లేదు అనడంతో మహేంద్ర జగతి ఇద్దరు షాక్ అవుతారు. ఇంతలోనే దేవయాని వస్తుంది.

Read Also : Guppedantha Manasu january 06 Today Episode : వసుధారపై సీరియస్ అయిన జగతి.. వసు మెడలో తాళి చూసి షాకైన రిషి?

Advertisement
Exit mobile version