Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Janaki Kalaganaledu june 20 episode : తల్లి చేతుల మీదుగా ప్రైజ్ మనీ అందుకున్న రామ… కోపంతో రగిలి పోతున్న కన్నబాబు సునంద?

Janaki Kalaganaledu june 20 episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా మారింది. కుటుంబ విలువలను తెలియచెప్పేలా ఉన్న ఈ సీరియల్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇకపోతే నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా మారింది. వంటల పోటీలలో రామచంద్ర గెలవకూడదని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ రామచంద్ర ఈ పోటీలలో గెలుస్తారు.పోటీలో గెలిచిన రామచంద్రకు జడ్జి ప్రభా ప్రైస్ మని అందిస్తుండగా రామచంద్ర తన తల్లి చేతులమీదుగా బహుమతి అందుకోవాలని ఉంది అంటారు.

Janaki Kalaganaledu june 20 episode

ఈ విధంగా రామచంద్ర తన తల్లి చేతుల మీదుగా బహుమతులు తీసుకోవాలని ఆశపడటంతో జడ్జి సైతం సంతోషపడి తన తల్లి జ్ఞానాంబ చేతుల మీదుగా రామచంద్రకు బహుమతి అందజేస్తుంది. ఇక తన కొడుకు గెలుపొందడంతో జ్ఞానంభ కూడా ఎంతో సంతోషపడుతుంది. రామచంద్ర గెలవడంతో సునంద కన్నబాబు కోపంతో రగిలి పోతూ ఉంటారు. ఇక తన అన్నయ్య గెలిచాడని ఊర్లో విష్ణు పెద్ద ఎత్తున హంగామా చేస్తాడు.తన అన్నయ్యకు ఘన స్వాగతం పలకడం కోసం ఏర్పాట్లు చేసి పెద్ద ఎత్తున డాన్సులు వేస్తూ ఉంటాడు.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

అది చూసిన మల్లిక తన బావ ఓడిపోతే ఇలా డాన్స్ వేయాలి అనుకుంటుంది. అయితే తను గెలిచాడు అంటూ బాధపడుతుంది. అదే సమయంలో ఊర్లోకి చేరుకున్న రామచంద్రకు ఘన స్వాగతం పలుకుతారు. ఇక రామచంద్ర తండ్రి కూడా డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తారు. నువ్వు నీ భయంతో రామచంద్రని ఈ పోటీలో కి వెళ్లకుండా ఆపావు. కానీ మన జానకి ఎంతో నమ్మకంతో తనని ఈ పోటీలో గెలిపించింది అంటూ గోవిందరాజులు చెబుతారు. దాంతో జ్ఞానంభ కూడా నిజమేనని సంతోషపడుతుంది.

Advertisement

ఇక గోవిందరాజులు మల్లిక దగ్గరకు వెళ్లి తన పై సెటైర్లు వేస్తాడు. మల్లిక కోపంతో రగిలిపోతూ తనకు ఎర్ర నీళ్లు తీసుకు వస్తుంది.అందరూ ఇంట్లోకి వెళ్ళగానే జానకి రామ గెలిచిన ట్రోఫీని ఒక స్థలంలో పెట్టడంతో అందరూ తన అన్నయ్య గెలిచిన ప్రైజ్ మనీతో బహుమతులు కావాలని డిమాండ్ చేస్తారు. అఖిల్ బండి కావాలని అడగగా, రామచంద్ర చెల్లెలు లాప్టాప్ కావాలి అని అడుగుతుంది, విష్ణు ఫోన్ కావాలని అడగడంతో మల్లిక మాత్రం తనకు రెండు లక్షలు కావాలని డిమాండ్ చేస్తుంది. ఈ విధంగా అందరూ కానుకలు అడిగేసరికి ఎవరికీ ఏమీ ఇచ్చేది లేదని జ్ఞానాంబ చెప్పి పంపుతుంది.

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

మరోవైపు రామచంద్ర డబ్బు గెలిచి తన అప్పు మొత్తం కట్టేస్తారని సునంద కన్నబాబు కోపంతో రగిలి పోతూ ఉంటారు.అనుకున్న విధంగానే జానకి రామ చంద్ర సునంద ఇంటికి వెళ్లి డబ్బు మొత్తం కట్టి అగ్రిమెంట్ చింపి పడేస్తూ జానకి సునందకు గట్టి వార్నింగ్ ఇస్తుంది. ఇలా జానకి వార్నింగ్ ఇవ్వడంతో కన్నబాబు సునంద తన పై మరింత కోపంతో రగిలి పోతారు. దీంతో ఈ ఎపిసోడ్ కాస్త పూర్తి అవుతుంది.

Read Also : Janaki Kalaganaledu june 15 Today Episode : కన్నబాబుకి స్ట్రాంగ్ గా బుద్ధి చెప్పిన గోవిందరాజులు.. గాయపడిన రామచంద్ర..?

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version