Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Rakesh master: ఆమె వల్ల అనాథ ఆశ్రమంలో చేరిన రాకేష్ మాస్టర్!

Rakesh master: రాకేష్ మాస్టర్.. సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి ఈ పేరు కొత్తేం కాదు. ఈయన పేరు మోసిన కొరియోగ్రాఫర్, డ్యాన్స్ మాస్టర్ అయినప్పటికీ ఆయనకు పాపులారిటీ తెచ్చింది మాత్రం ఆయన బూతులే అని చెప్పాలి. ఆయన కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పుడు చాలా తక్కువ మందికి మాత్రమే రాకేష్ మాస్టర్ గురించి తెలుసు. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియాకు వచ్చి బూతు పురాణం మొదలు పెట్టారో ఇక చాలా మందికి తెలిసిపోయారు. రాకేష్ మాస్టర్ 1500లకు పైగా సినిమాలకు డ్యాన్స్ కంపోజింగ్ చేశారు. ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉన్న జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఒకప్పుడు రాకేష్ మాస్టర్ శిష్యులు. అంతటి చరిత్ర ఉన్నా.. రాకేష్ మాస్టర్ మాత్రం అలా అయిపోయారు.

అసలు విషయంలోకి వస్తే.. భార్యను వదిలేసి కనక లక్ష్మీ అనే మరో మహిళతో సహజీవనం చేస్తున్న రాకేష్ మాస్టర్.. తన చేతిలో బాగా మోసపోయాడట అందుకే తను అనాథ శరణాలయంలో చేరారని స్వయంగా రాకేష్ మాస్టరే వెల్లడించారు. తన భార్యా పిల్లలూ తనను వదిలివేయడంతో తినడానికి తిండి లేక ఇబ్బందులు పడ్డానని, ఆ సమయంలో కనక లక్ష్మీ ఎంతో సాయం చేసిందని చెప్పారు రాకేష్ మాస్టర్. తినడానికి తిండి కూడా లేని సమయంలో కనక లక్ష్మే తనకు మూడు పూటలా తిండి పెట్టిందన్నారు. కానీ తర్వాత తన నిజస్వరూపం బయట పెట్టిందని… తరచూ దూషించేదని, కూతురుతో మాట్లాడినా అక్రమ సంబంధం అంటగట్టేదని.. ఇక తనతో వేగలేక అనాథ ఆశ్రమంలో జాయిన్ అయినట్లు వెల్లడించారు.

Advertisement
Exit mobile version