Viral Video: సాధారణంగా పాము పేరు వినిపించగానే చాలామంది ఆమడ దూరం పరిగెత్తారు. పాము చిన్నదైనా పెద్దదైనా చాలామందిలో భయం అనేది ఉంటుంది. చిన్న పాముకే ఈ స్థాయిలో భయపడేవారు కొండచిలువ పేరు వింటే దరిదాపుల్లోకి కూడా రారు. ఒక్కసారిగా కొండచిలువ చేతికి చిక్కామంటే ఇక మన ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. అయితే తరచూ కొండచిలువ పలు రకాల జంతువులు మనుషుల పై దాడి చేస్తున్న ఘటనల గురించి మనం ఎన్నో విన్నాం.ఇక ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
కొండచిలువ నుంచి తప్పించుకొని ప్రాణాలను కాపాడుకోవాలని ఆవు దూడ ఎంతో ప్రయత్నిస్తున్నప్పటికీ కొండచిలువ మాత్రం పట్టు వదలకుండా పట్టుకుంది. అయితే ఆవు దూడ మాత్రం నొప్పిని భరిస్తూ ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగు తీస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ కొండచిలువ నుంచి ఆవు దూడ తన ప్రాణాలను కాపాడుకుందా? లేక కొండచిలువకు బలై పోయిందా అనే విషయం తెలియడం లేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
