Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Karthika Deepam july 26 Today Episode : హిమకు బంపర్ ఆఫర్ ఇచ్చిన నిరుపమ్.. సంతోషంలో ప్రేమ్..?

Karthika Deepam july 26 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నిరుపమ్ నేను చచ్చేంత వరకు నీతోనే కలిసి ఉంటాను అంటూ హిమకు తెగేసి చెబుతాడు. ఈరోజు ఎపిసోడ్ లో నిరుపమ్ ఎంత చెప్పినా వినిపించుకోకుండా హిమ అలాగే మాట్లాడడంతో వెంటనే సౌందర్య ఏంటి హిమ ఇది అంటూ హిమకు నచ్చి చెప్పడానికి ప్రయత్నించగా మధ్యలో ఆనందరావు కూడా హిమకు నచ్చజెప్పి ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత నిరుపమ్ నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను ఈ క్షణం ఇప్పుడే సౌర్యతో నేను నిరుపమ్ బావని ప్రేమిస్తున్నాను.

Karthika Deepam july 26 Today Episode

నిరుపమ్ బావని పెళ్లి చేసుకుంటాను అని పలికించు ఈ క్షణమే సౌర్య మెడలో తాళి కడతాను అలా చేయగలవా లేదు కదా హిమ మరి ఎందుకు అంతలా ఆరాటపడుతున్నావు అంటూ హిమపై కోప్పడి తాళిబొట్టు హిమ చేతిలో పెట్టి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు నిరుపమ్. మరొకవైపు ప్రేమ్, హిమ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే హిమా అక్కడికి రావడంతో సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు.

హిమ తనతో బాధలు షేర్ చేసుకోవడంతో నిరుపమ్ మరింత సంతోషిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ప్రేమ్ నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది అందుకు నువ్వు ఓకే అనాలి అనగా నువ్వు ఏం చెప్పినా కూడా ఓకే అంటాను బావ అని అనడంతో ఏం మరింత సంతోష పడుతూ ఉంటాడు. ఆ తర్వాత స్వప్న, నిరుపమ్ కోసం వెతుకుతూ ఉండగా ఇంతలో అక్కడికి తీసుకొని ఎంట్రీ ఇవ్వడంతో స్వప్న సంతోష పడుతూ ఉంటుంది.

Advertisement

కార్తీక దీపం జూలై 26 ఈరోజు ఎపిసోడ్ : శౌర్య ఇచ్చిన తాళిని నిరుపమ్ హిమ కి కడతాడా..

Karthika Deepam

ఆ తర్వాత వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో నిరుపమ్ అక్కడికి వచ్చి శోభ అక్కడికి రావడం ఏంటి అన్నట్టుగా చిరాకుతో వెళ్లిపోతాడు. మరొకవైపు సూర్య ఆటోని క్లీన్ చేస్తూ జరిగిన విషయాలను తలుచుకొని బాధపడుతూ ఉండగా ఇంతలో హిమ రావడంతో సౌర్య ఎందుకు నేనంటే నీకు అంత కోపము. నేను నీకు ఏం ద్రోహం చేశాను. అమ్మ నాన్న లను లేకుండా చేశావు.

నేను ప్రేమించిన డాక్టర్ సాబ్ ని కూడా లాక్కున్నావు ఎందుకు నేనంటే నీకు అంత పగ అనగా అప్పుడు హిమ నచ్చచెప్పే ప్రయత్నం చేయడంతో సౌర్య వినిపించుకోకుండా హిమ పై సీరియస్ అయి హిమను మరింత అపార్థం చేసుకుంటుంది. ఆ తర్వాత సౌందర్య సౌర్య ఇద్దరు ఇంట్లో కూర్చుని ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి హిమ వస్తుంది. అది చూసిన హిమ వాళ్ళ సంతోషాన్ని పాడు చేయకూడదు అని బయటకు వెళ్తూ ఉండగా ఇంతలోనే ఎక్కడికి నిరుపమ్ లగేజీ తీసుకొని ఎంట్రీ ఇస్తాడు.

Karthika Deepam

దాంతో హిమ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు నిరుపమ్ అక్కడికి వచ్చి తేగ హడావిడి చేస్తూ ఉండగా సౌర్య కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు ప్రేమ్,హిమ మాట్లాడిన మాటలు అన్ని తలుచుకొని ఆనంద పడుతూ ఉంటాడు. ఇంతలోనే హిమ, ప్రేమ్ కీ ఫోన్ చేసి నిరుపమ్ బావ లగేజ్ తీసుకొని మా ఇంటికి వచ్చాడు అనడంతో ప్రేమ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత హిమ స్వప్న శోభ ఏం చేయబోతున్నారు అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది.

Advertisement

Read Also : Karthika Deepam july 25 Today Episode : బాధతో కుమిలిపోతున్న సౌర్య.. హిమపై మండిపడ్డ నిరుపమ్..?

Exit mobile version