Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Karthika Deepam july 20 Today Episode : హిమ,సౌర్య లను కలిపి ప్రయత్నంలో సౌందర్య..నిరుపమ్,సౌర్యని ఒక్కటి చేయాలనుకుంటున్న ప్రేమ్..?

Karthika Deepam july 20 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీక దీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో బోనాల పండుగకు వెళ్లడానికి సౌందర్య కుటుంబం సిద్ధపడుతూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో హిమ, ప్రేమ్ కి ఫోన్ చేసి మా ఇంట్లో బోనాల పండుగ చేస్తున్నాము ఎలా అయినా నిరుపమ్ బావని బోనాల పండుగకు పిలుచుకొని రా అని చెబుతుంది. ఆ తర్వాత ప్రేమ్,నిరుపమ్ దగ్గరికి వెళ్లి హిమ ఫోన్ చేసింది. బోనాల పండుగకు రమ్మని చెప్పింది అనడంతో వెంటనే నిరుపమ్, సరే వెళ్దాం అని సంతోషంగా అంటాడు.

Karthika DeepamKarthika Deepam july 20 Today Episode :Prem and Nirupam join Soundarya’s family for shopping in todays karthika deepam serial episode

మరొకవైపు సౌందర్య కుటుంబం బోనాలు పండుగకు బయలుదేరుతారు. అప్పుడు సౌర్య మీది కారు రేంజ్ నాది ఆటో రేంజ్ మీ కార్లు మీరు రండి ఆటోలో నేను వస్తాను అని అనగా వెంటనే సౌందర్య అమ్మవారికి బోనం సమర్పించే అంతవరకు నేను చెప్పినట్లు నువ్వు వినాలి ఆ తరువాత నువ్వు చెప్పినట్టు నేను వింటాను అని సౌర్యతో డీల్ కుదుర్చుకుంటుంది.

ఆ తర్వాత సౌర్య పక్కన హిమ కూర్చోవడానికి భయపడుతూ ఉండగా అప్పుడు హిమ ఆనందరావుని అడగగా ఆనందరావు నాకు కంఫర్ట్ గా ఉండదు అని చెప్పడంతో వెనుక వైపు వెళ్లి కూర్చుంటుంది హిమ. మరొకవైపు ప్రేమ్,నిరుపమ్ ఇద్దరూ సౌందర్య ఇంటికి వెళుతూ ఉండగా అప్పుడు ప్రేమ్, సౌర్య గురించి గొప్పగా మాట్లాడడంతో నిరుపమ్ ఆశ్చర్యపోతాడు.

Advertisement

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ జూలై 20 ఎపిసోడ్ శౌర్య ను మార్చే ప్రయత్నం లో సౌందర్య…

ఏంటి ప్రేమ్ ఒకప్పుడు నువ్వు సౌర్య ఒకరంటే ఒకరికి పడదు కదా అని అనగా సౌర్యదీ నిజమైన ప్రేమ అని అంటాడు ప్రేమ్. అలా వారిద్దరూ సౌర్య గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. మరొకవైపు శోభ, హాస్పిటల్ వాళ్ల గురించి నిరుపమ్ గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి పనిమనిషి వచ్చి డబ్బులు అడగడంతో ఆమె పై కోప్పడుతుంది. ఆ తర్వాత ఆమెకు స్వారీ చెప్పి డబ్బులు ఇచ్చి పంపిస్తుంది.

మరొకవైపు సౌందర్య కుటుంబం షాపింగ్ చేసుకొని బయటకు వస్తారు. అప్పుడు ప్రేమ్ ఎలా అయినా హిమతో కలిసి వెళ్లాలి అనుకుని సౌర్యని నిరుపమ్ కారులో వెళ్ళమని చెబుతాడు. అప్పుడు ప్రేమ్ వెళ్లి సౌందర్య కారులో హిమ పక్కన కూర్చుని సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు ప్రేమ్ చేసిన పనికి హిమ సంతోష పడుతూ ఉంటుంది. సౌందర్య కుటుంబం కార్లు వెళ్తూ సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు.

ప్రేమ్ మాత్రం హిమ పక్కనే కూర్చుని ఆనందంతో మురిసిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు నిరుపమ్, సౌర్య ఒకే కారులో వెళుతూ ఇద్దరు జరిగిన విషయాల గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటారు. అప్పుడు సౌర్య నేను ఎవరిని మోసం చేయలేదు నేను ఎందుకు ఇలా ఉండాలి అని నిరుపమ్ ముందరే కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చుంటుంది.

Advertisement

Read Also : Karthika Deepam July 19 Today Episode : ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అనుకున్న సౌందర్య దంపతులు.. హిమ, సౌర్యలను కలిపేందుకు సౌందర్య ప్లాన్!

Exit mobile version