Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Interesting news: పెళ్లై 17 ఏళ్లైనా పిల్లలు పుట్టడం లేదని ఓ భర్త పాడు బుద్ధి

Interesting news : ఆ దంపతులకు చాలా ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కానీ సంతానం మాత్రం కలగలేదు. గుళ్లు, గోపురాలు తిరిగినా ఫలితం లేదు. ఆస్పత్రుల చుట్టూ వైద్యుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా సంతానం మాత్రం కలగలేదు. ఈ క్రమంలో ఆ భార్య పుట్టింటికి వెళ్లింది. ఆ భర్త ఆమెకు ఫోన్ చేశాడు. ఫోన్ లో భర్త చెప్పింది విన్న ఆమె.. అతడి మాటలను లైట్ తీసుకుంది. ఆటపట్టించడానికి అలా అన్నాడేమో అనుకుంది. కానీ భర్త తనకు నిజంగానే షాక్ ఇచ్చాడని తర్వాత ఆమెకు తెలిసి వచ్చింది.

అసలింతకూ ఏం జరిగిందంటే.. ఛత్తీస్ గఢ్ లోని జష్పూర్ జిల్లాకు చెందిన ఓ మహిళకు ఇల్తాఫ్ ఆలం అనే వ్యక్తితో 2005లో పెళ్లి అయింది. పెళ్లై ఏళ్లు గడిచాయి కానీ సంతానం మాత్రం కలగలేదు. ఈ క్రమంలో పుట్టింటికి వెళ్లినా ఆమెకు భర్త ఫోన్ చేసి త్రిపుల్ తలాక్ చెప్పాడు. ఈ విషయాన్ని ఆమె సీరియస్ గా తీసుకోలేదు.

Interesting news

ఇల్తాఫ్ ఆలం సీరియస్ గానే తనకు ట్రిపుల్ తలాక్ చెప్పాడని.. మరో మహిళను కూడా పెళ్లి చెసుకున్నాడని గ్రహించి ఆమె తీవ్రంగా కలత చెందింది. తనకు న్యాయం చేయాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే ట్రిపుల్ తలాక్ ను ఆ మధ్యే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇలా ట్రిపుల్ తలాక్ చెప్పి విడిపోవడం చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
Read Also : Hyderabad Crime : హైదరాబాద్ నడిబొడ్డున మరో పరువు హత్య.. కూతురు ముందే భర్తను దారుణంగా చంపిన వైనం! 

Advertisement
Exit mobile version