Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

 Nuvvu Nenu Prema Serial : పద్మావతి దూరమవుతోందని తెలిసి, ఆందోళన లో విక్రమాదిత్య !  

Nuvvu Nenu Prema Serial July 30 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా పద్మావతి తిరుపతి కి వెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూద్దాం. అరవింద విక్కీ చేతిలో ఉన్న ఫోను చూసి ఏమైంది ఇలా ముక్కలైంది ఏంటి పగిలిందా లేక నువ్వే పగల కొట్టావా ఏమైంది పద్మావతి తో మళ్ళీ గొడవ పడ్డావా అంటుంది. అప్పుడు విక్కీ నాకు అది తప్ప వేరే పనేం లేదా అంటాడు. అప్పుడు అరవింద వస్తువు పగిలితే అతికించవచ్చు కానీ మనసు విరిగితే అతికించలేము ఇద్దరు వ్యక్తుల మధ్య స్వీట్ మెమరీస్ ఎలా గుర్తుండిపోతాయి.

padmavathi-returns-back-to-her-hometown-on-the-other-hand-aravinda-suspects-muralis-unusual-behaviour

అలాగే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ కూడా బ్యాడ్ మెమరీస్ కూడా అలాగే ఉండిపోతాయి. ప్రేమను మర్చిపోతారు కానీ కోపాన్ని మాత్రం అలాగే గుర్తుంచుకుంటారు. నువ్వు ఎవరు మైండ్ లో బ్యాడ్ మెమరీ గా ఉండకూడదు నిన్నెవరు గుర్తుంచుకున్న మంచిగానే గుర్తుంచుకోవాలి అంటుంది. అప్పుడు విక్కీ అక్క నేను మాయ దగ్గరికి వెళ్తున్న తర్వాత మాట్లాడతాను అంటాడు. అరవింద నేను గుడికి వెళ్ళాలి ఇవాళ శ్రావణ శుక్రవారం నన్ను తీసుకెళ్తావా అంటుంది. అప్పుడు విక్కీ బావ గారితో వెళ్ళొచ్చు కదా అక్క అంటాడు. అప్పుడు అరవింద మీ బావ గారికి ఏదో పని ఉందంట అందుకే నీతో వెళ్ళమన్నాడు అంటుంది. ఏ గుడికి అక్క అనగానే మధురవాడ అంటుంది.

 Nuvvu Nenu Prema Serial July 30 Today Episode : జన్మలో కనిపించనని విక్రమాదిత్యని వదలి వెళ్లిన పద్మావతి  

అపుడు విక్కి మధురవాడ నా అనగానే ఎందుకు అంత దీర్ఘం తీస్తున్నావు నీకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటుంది. అప్పుడు విక్కీ తన మనసులో అక్కడ పద్మావతి ఉంటుంది అక్క అనుకుంటాడు. అరవింద సరే నేను వెళ్లి పూజ సామాగ్రి తీసుకొస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతుంది. పద్మావతి, అను మరియు వాళ్ళ అత్త ఆటోలో వెళుతూ ఉంటారు. అను ఏంది నువ్వు అన్నట్టే మనం తిరుపతి వెళ్తున్నాం కదా మరి ఎందుకు అలా ఉన్నావ్ అంటుంది. అప్పుడు వాళ్ళ అత్త అసలుకే మీ నాయన కి అక్కడ సరిగా ఉండదు. అక్కడికి వెళ్లి ఏం చేయాలని దిగులు పడుతుందేమో అంటుంది.

Advertisement
padmavathi-returns-back-to-her-hometown-on-the-other-hand-aravinda-suspects-muralis-unusual-behaviour

అప్పుడు అను ఇదంతా నా వల్లే జరిగింది నాకు పెళ్లి కుదరకపోతే మనం అక్కడే ఉండి అమ్మానాన్నలకి ఆసరాగా ఉండేవాళ్ళం ఇక్కడికి వచ్చి చెల్లి ఇన్ని అనుమానాలు పడాల్సి ఉండేది కాదు అంటుంది. అప్పుడు పద్మావతి నీ తప్పేం లేదు అక్క ఇదంతా నా వల్లే జరిగింది. అత్త చీరల బిజినెస్ పోగొట్టను అందుకే ఆ తింగరోడు చేతిలో మాటలు పడాల్సి వచ్చింది అంటుంది. అప్పుడు వాళ్ళ అత్త మీరు ఎంత ఆలోచించినా సమస్యలు తీరవు మీరు అక్కడికి వెళ్లి మీ అమ్మానాన్నలకు ఇంకా భారం అవుతారా ఆ టెంపరోడి మీద కోపంతో ఉద్యోగం చేసావు. ఇప్పుడు మీ నాన్న మీద ఉన్న ప్రేమతో ఇక్కడే ఉండి ఏదో ఒక ఉద్యోగం చేయలేవా అంటుంది.

అరవింద గుడి లోకి వెళుతుంది. స్వామి నేను అనుకున్నట్టుగానే మా ఆయన ను నా దగ్గరికి వచ్చాడు. అలాగే మా విక్కీ మనసుని అర్థం చేసుకునే అమ్మాయి ఎక్కడున్నా నువ్వే వాళ్ళని కలపాలి అని దండం పెట్టుకుంటుంది. ఇక మురళి పద్మావతి కోసం వాళ్ళ ఇంటికి వెళ్తాడు కానీ ఇంటికి లాక్ చేసి ఉంటుంది. ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవదు అక్కడ హోటల్ లో ఉన్న బాబాయ్ దగ్గరికి వెళ్లి పద్మావతి వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి తిరుపతి వెళ్లారు అని చెప్తాడు. అప్పుడు మురళి చాలా సంతోషపడుతూ నేను వాళ్లని ఇక్కడ నుండి ఎలా షిఫ్ట్ చేయాలా అనుకున్నాను కానీ వాళ్లు వెళ్ళి నా పనినీ చాలా సులభతరం చేశారు. ఇక నా గురించి పద్మావతికి తెలిసే అవకాశమే లేదు అనుకుంటూ సరే బాబాయ్ నాకు చాలా పని ఉంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

padmavathi-returns-back-to-her-hometown-on-the-other-hand-aravinda-suspects-muralis-unusual-behaviour

అరవింద గుడి లో నుంచి బయటికి వచ్చి విక్కీ కోసం వెతుకుతుంది. విక్కీ పద్మావతి కోసం వాళ్ళ ఇంటికి వెళతాడు. కాని వాళ్ళ ఇంటికి లాక్ చేసి ఉంటుంది. అప్పుడు హోటల్ లో ఉన్న బాబాయ్ వచ్చి ఎవరు నువ్వు ఈ ఏరియా లో ఎప్పుడు కనిపించలేదు అంటాడు. అప్పుడు విక్కీ పద్మావతి గురించి అడుగుతాడు. మా పద్మావతి బేటి నీకెలా తెలుసు అనగానే నేను విక్రమాదిత్యని అంటాడు. అప్పుడు ఆ బాబాయ్ ఓ నువ్వేనా విక్రమాదిత్య మా పద్మావతి భేటీ ఏం పాపం చేసిందని తనను అలా ఏడిపించావు. నీ దగ్గర పని చేసినంత మాత్రాన నువ్వు చెప్పినట్టు వినాలా అంటాడు. అదిగో చూడు నా దాబా నా దగ్గర చాలా మంది పని చేస్తారు కానీ నేనెప్పుడూ అలా చేయలేదు అంటాడు.

Advertisement

నీ మొహం చూస్తే అసహ్యం వేస్తుంది. మా పద్మావతి బేటీ ని బాధ పెట్టినందుకు ఆ పాపం ఊరికే పోదు అని తిట్టి అక్కడి నుండి వెళ్ళి పోతాడు. అరవింద వికీని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. ఏంటి ఇక్కడ ఉన్నావ్ ఎవరిదీ ఈ ఇల్లు అని అడుగుతుంది. అప్పుడు వికీ పద్మావతి ది అక్క అని అంటాడు. మరి ఏంటి తాళం వేసి ఉంది అనగానే పద్మావతి వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. ఇక నా మొహం కూడా చూడడం ఇష్టం లేదంటూ ఈ ఊరు విడిచిపెట్టి వెళ్లిపోయింది అక్క అంటాడు. ఏంటో నాలో ఉన్న కోపాన్ని ఎంత తగ్గించుకుదామన్న తన అన్న మాటలకి నాకు ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. అదే నన్ను రాక్షసుని చేసింది అంటాడు.

Padmavathi returns back to her hometown. On the other hand, Aravinda suspects Murali’s unusual behaviour.

అప్పుడు అరవిందా బాధపడకురా నువ్వు తన గురించి ఫీల్ అవుతున్నట్లు గానే తను కూడా నీ గురించి ఫీల్ అవుతుందేమో ఏదో ఒక రోజు అన్ని పరిస్థితులు చక్కబడతాయి. పద వెళ్దాం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. అప్పుడు అరవింద అక్కడే ఉన్న తన భర్త ని చూస్తుంది. అప్పుడు విక్కీ ఏంటి అక్క అలా చూస్తున్నావ్ అనగానే అరవింద మీ బావగారు ఏదో పని ఉందని చెప్పాడు కానీ ఇక్కడ ఉన్నాడు ఏంటి అంటుంది. అప్పుడు విక్కీ వాళ్ళ బావ ని చూసి ఉండు నేను పిలుస్తాను అంటాడు. అప్పుడు అరవింద వద్దు విక్కీ నేనే కాల్ చేస్తాను అని చెప్పి మురళి కి కాల్ చేస్తుంది. ఇక రేపు జరగబోయే ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూడాలి.

Read Also : Nuvvu Nenu Prema Serial : ఇంటికి వెళ్లిపోతున్న పద్మావతి, అను.. దూరమవుతున్నారని తెలిసి ఆందోళనలో విక్రమాదిత్య, ఆర్య..

Advertisement
Exit mobile version