One Plus10 Pro: భారత స్మార్ట్ ఫోన్ రంగంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వన్‌ప్లస్ ఇటీవల వరుసగా కొత్త ఫోన్లను విడుదల చేస్తూ వస్తోంది.ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్స్ తో వినియోగదారులకు అందుబాటులోకి రాగానే తాజాగా వన్ ప్లస్ 10 ప్రో అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి విడుదలైంది. అధునాతనమైన ఫీచర్లతో నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ మార్కెట్లో, ఈ కామర్స్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. ఎన్నో అద్భుతమైన ఫీచర్స్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం…
ఇక ఈ ఫోన్లో వీడియో రికార్డింగ్ కోసం మూవీ మోడ్ అనే ఫీచర్‌ను ప్రత్యేకంగా ఇచ్చారు. దీంతో హైక్వాలిటీ ఫోటోలను తీసుకోవచ్చు. ఇక నేడు మార్కెట్లోకి విడుదలైన 5 జీ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో ఉంది.
8 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ కలిగి ఉన్న స్మార్ట్ ఫోన్ ధర 66,999 కాగా,12 జీబీ+256 జీబీ ధర రూ. 71,999గా ఉంది. ఇలాంటి అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ నేటి (ఏప్రిల్ 5వ తేదీ) నుంచి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ అయిన అమెజాన్ లో అందుబాటులో ఉంది.