Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Nuvvu Nenu Prema Serial : పద్మావతిని వేధించిన వ్యక్తిని చితక్కొట్టిన విక్రమాధిత్య.. పద్మావతిని చూడగానే పారిపోయిన మురళి.. అనుమానంతో నిలదీసిన వికీ..!

Nuvvu Nenu Prema Serial Aug 5 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమౌతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా పద్మావతి రెస్టారెంట్ కి రావడం మురళి చూస్తాడు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది ఇప్పుడు చూద్దాం. అరవింద వాళ్ల పిన్ని కృష్ణ నువ్వు రోజూ ఇక్కడే ఉంటే మనం ఇలాగే ఎంజాయ్ చేయొచ్చు అంటుంది. అప్పుడు కృష్ణ ఏం చేస్తాం అత్తయ్య మనిషి ఒక దగ్గర మనసు ఒక దగ్గర అనగానే ఆర్య ఏంటో బావగారు ఏం చెప్పినా ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది అంటాడు. అప్పుడు విక్కీ ఏం మిస్ అవుతున్నారు మాకు చెప్పండి బావగారు లేదంటే మా అక్క మిమ్మల్ని సరిగా చూసుకోవడం లేదు అనుకుంటుంది. అప్పుడు అరవింద మీ బావగారిని ఆటపట్టించడం మానేయండి అంటుంది.

Vikramaditya thrashes a man when he misbehaves with Padmavathi

అప్పుడు విక్కీ బావగారు చాలా అదృష్టవంతుడు అంటాడు. అప్పుడు కృష్ణ తన మనసులో నాకు పద్మావతి దొరికినప్పుడు నేను అదృష్టవంతుడిని అనుకుంటాడు. ఇక అక్కడే ఉన్న పద్మావతిని చూసి టెన్షన్ పడతాడు. ఇక తను నన్ను చూస్తే నేను ఊహించుకున్న జీవితం అంతా సర్వనాశనం అయిపోతుంది అనుకుంటాడు. ఇక పద్మావతి సార్ పిలవగానే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక పద్మావతి సార్ పిలిచాడని లోపలికి వెళ్తుంది.

అతను పద్మావతిని చూసి ఇంత అందమైన అమ్మాయిని మిస్ కాకూడదు అనుకుంటాడు. పద్మావతి సార్ నేను ఇక్కడికి పని కోసం వచ్చాను అంటుంది. అప్పుడు అతను ఇంత అందమైన అమ్మాయి ఇక్కడ పని చేయడం ఏంటి అంటాడు. అప్పుడు పద్మావతి నేను ఇక్కడ పని చేయడానికి రాలేదు కానీ మీ ఆర్డర్ కోసం క్యాటరింగ్ చేయడానికి వచ్చాను. మీకు రుచికరమైన ఇంటి భోజనం తయారు చేసి సప్లై చేస్తాను.

Advertisement
Vikramaditya thrashes a man when he misbehaves with Padmavathi

ఏమైనా ఆర్డర్స్ ఉంటే మాకు ఇవ్వండి సార్ అంటుంది. అప్పుడు అతను ఈ రెస్టారెంట్ కి వచ్చే ఆర్డర్స్ అన్ని నీకు ఇప్పిస్తాను కానీ నాకేంటి అంటాడు. అప్పుడు పద్మావతి ఏంటి సార్ అనగానే నేను నీకు నాకేంటి అంటాడు. అప్పుడు పద్మావతి ఏంటి సార్ అనగానే నేను నీకు హెల్ప్ చేస్తున్నాను కాబట్టి నా కోరిక నువ్వు తీర్చాలి అని అంటాడు. అప్పుడు పద్మావతి వీడు మంచివాడు కాదు నేను ఇక్కడ నుండి ఎలా బయటపడాలి అనుకుంటుంది. పద్మావతి అక్కడికి వచ్చిన విక్కీ ని చూసి ఈ టెంపరోడు సాయం తీసుకుని ఎలాగైనా ఎక్కడ నుండి బయటపడాలి అనుకుంటుంది. ఇక విక్కీ ని రమ్మని పిలుస్తుంది. అప్పుడు విక్కీ నన్ను పిలిచేది పద్మావతి కాదు ఇదంతా నా బ్రమ అనుకుంటూ అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఇక అతను పద్మావతిని బలవంతం చేయబోతాడు.

అతను పద్మావతి చెయ్యి పట్టుకోగానే విక్కీ వచ్చి అతన్ని కొట్టుకుంటూ తీసుకెళ్తాడు. ఇక అరవింద అతన్ని కోట్టకుండా ఆపుతుంది.  ఏమైంది పద్మావతి అంటుంది. ఇక కృష్ణ అక్కడ ఉన్న పద్మావతిని చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ రెస్టారెంట్ లో పని చేసే వ్యక్తి వచ్చి ఏమైంది సర్ ఎందుకు మా మేనేజర్ ని కొడుతున్నారు అంటాడు. అప్పుడు విక్కీ వీడు ఈ అమ్మాయి చెయ్యి పట్టుకొని బలవంతం చేయబోయాడు అని చెప్తాడు. అప్పుడు అతను సారీ సార్ వీడి ఇలాంటి వాడని నాకు తెలియదు వెంటనే వీడిని పోలీసుల కి అప్పగిస్తాను అంటాడు. అప్పుడు మాయ ఈ అప్పలమ్మ వల్లే విక్కీ డిస్టర్బ్ అవుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా వదలట్లేదు అనుకుంటుంది. ఇక అరవింద ఏం బాధపడకు పద్మావతి రా నేను డ్రాప్ చేస్తాను అంటుంది. అప్పుడు పద్మావతి ఏం పర్లేదు నేను వెళ్ళగలను అంటుంది. వెంటనే విక్కీ డ్రాప్ చేస్తాను అని చెప్పినప్పుడు వెళ్లొచ్చు కదా అంటాడు.

Vikramaditya thrashes a man when he misbehaves with Padmavathi

అప్పుడు పద్మావతి ఇలా ఆడవాళ్ళని చులకనగా చూసే వాళ్ళని నేను చాలా మందిని చూశాను. ఇప్పుడు నాకు వాటన్నింటిని తట్టుకునే శక్తి ఉంది. నాకు ఎవరి సాయం అక్కర్లేదు నేనేంటో నేను నిరూపించుకోగలను అంటుంది. నేను ఒక్కదాన్నే వెళ్ళగలను అంటూ అక్కడి నుండి ఇక విక్కీ కూడా అక్కడ నుండి వెళ్ళి పోతాడు. అరవింద బావగారు ఎక్కడ అని ఆర్య ని అడుగుతుంది. ఏమో అక్క నాకు తెలీదు అంటాడు. సరే వెళ్దాం పదండి అనుకుంటూ బయటికి వస్తారు. ఇక కృష్ణ పద్మావతి కి కనిపించకుండా జాగ్రత్త పడతాడు. అప్పుడు విక్కీ వాళ్ల బావ గారి దగ్గరికి వచ్చి ఏమైంది బావ గారు మేమంతా లోపల మీ కోసం వెయిట్ చేస్తుంటే మీరు బయట ఉన్నారా ఏంటి అని అడుగుతాడు. అప్పుడు అరవింద కూడా ఏమైంది అండి చాలా టెన్షన్ గా ఉన్నారు అంటుంది.

Advertisement

అప్పుడు కృష్ణ ఏం లేదు రాణమ్మ అంటాడు. అప్పుడు విక్కీ లేదు ఏదో ఉంది లేకపోతే మీరు ఇక్కడికి వచ్చి దాచు కోరు అంటాడు. అరవింద కూడా ఏమైంది చెప్పండి మీరు మా దగ్గర ఏదో దాస్తున్నారు అంటుంది. అప్పుడు కృష్ణ ఏం లేదు మీరు అంత టెన్షన్ పడకండి నేను ఒక క్రిమినల్ కేస్ టేకప్ చేస్తున్నా ముద్దాయి కనిపించినట్టు కనిపించి ఇక్కడ నుంచి పారిపోయాడు అంటాడు. అప్పుడు అరవింద మీరు ఇలాంటి పనులు చేయకండి మీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను అంటుంది.

అప్పుడు కృష్ణ పదండి లంచ్ కి వెళ్దాము అనగానే అరవింద ఏం వద్దు ఇంటికి వెళ్దాం పదండి అంటుంది. ఇక అందరూ కలిసి ఇంటికి వెళతారు. పద్మావతి కూర్చుని రెస్టారెంట్ లో జరిగిన దాని గురించి బాధ పడుతుంది. ఏంటయ్యా శ్రీనివాస నేను కష్టాలు తీర్చాలని అనుకుంటే బదులుగా నాకే కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఈ విషయం మా అత్తకి తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి బయటికి వెల్లనివ్వదు కాళ్లు విరిచి పొయ్యిలో పెడుతుంది అంటుంది. ఇక రేపు ఏం జరుగుతుందో చూడాలి.

Read  Also : Nuvvu Nenu Prema Serial : రెస్టారెంటులో పద్మావతిని చూసి షాకైన మురళి.. పద్మావతికి మురళి.. అరవింద భర్త అనే నిజం తెలుస్తుందా?

Advertisement
Exit mobile version