Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Karthika Deepam july 25 Today Episode : బాధతో కుమిలిపోతున్న సౌర్య.. హిమపై మండిపడ్డ నిరుపమ్..?

Karthika Deepam july 25 Today Episode  : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌందర్య, సౌర్యతో మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో సౌర్య బయటకు వెళుతూ ఉండగా అప్పుడు సౌందర్య,ఆనందరావు పేరు చెప్పి ఎమోషనల్ గా డైలాగులు మాట్లాడి సౌర్య నీ వెళ్లకుండా ఆపేస్తుంది. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళగా ఇంతలోనే ఆనంద్ రావు ని చెక్ చేసి నిరుపమ్, హిమ కిందకి తీసుకువస్తూ ఉండగా అప్పుడు సౌర్య అవ్వాలని చూసి కోపంతో లోపలికి వెళ్ళిపోతుంది.

Karthika Deepam july 25 Today Episode Nirupam firm decision upsets her as she wishes not to marry him in todays karthika Deepam serial episode

ఆ తర్వాత నిరుపమ్, తాతయ్యకి ఏమి కాలేదు మీరు టెన్షన్ పడి తాతయ్యని టెన్షన్ పెట్టొద్దు అమ్మమ్మ అని చెప్పి ఎక్కడ నుంచి వెళ్ళిపోతారు ప్రేమ్,నిరుపమ్. మరొకవైపు శోభ కోపంతో వస్తువులన్నీ విసిరేస్తూ ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు స్వప్న మాటలు, జరిగిన విషయాలు అన్నీ తలుచుకుని కోపంతో రగిలిపోతూ ఉంటుంది.  మరోవైపు హిమ,కార్తీక్,దీప ల ముందు నిలబడి సౌర్య గురించి చెప్పుకొని ఎమోషనల్ అవుతూ ఉండిగా సౌందర్య అక్కడికి వచ్చి ఏం జరిగింది హిమ అని అనడంతో వెంటనే హిమ నిరుపమ్ బావ వచ్చాడు. సౌర్య గదిలోకి వెళ్ళాడు నానమ్మ మళ్ళీ ఏం గొడవ జరుగుతుందని భయంగా ఉంది అనడంతో సౌందర్య వాళ్ళు అక్కడికి వెళ్తారు.

Karthika Deepam  : హిమకు ప్రేమ్ చెప్పిన  ప్రేమ సూత్రాలు శౌర్య , నిరుపమ్ లను కలపగలవా…

మరొకవైపు సౌర్య జరిగిన విషయాల గురించి తలుచుకొని నిరుపమ్ ఫోటో చూస్తూ బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి నిరుపమ్ వస్తాడు. అప్పుడు నిరుపమ్ జరిగిన విషయాల గురించి మాట్లాడగా అసలు విషయం ఏంటో చెప్పండి డాక్టర్ సాబ్ అని అనడంతో హిమనీ నేను ప్రాణంగా ఇష్టపడ్డాను. మా అమ్మ మనసు నువ్వే మార్చాలి మా ఇద్దరి పెళ్లి నువ్వే చేయాలి అని నిరుపమ్ అనడంతో సౌర్య షాక్ అవుతుంది.

Advertisement
Karthika Deepam july 25 Today Episode 

ఇంతలోనే అక్కడికి హిమ వచ్చి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు ఇదే మాట ఎప్పటినుంచో చెబుతున్నాను నువ్వు వినిపించుకోవడం లేదు అని అనగా వెంటనే సౌర్య, బాగుంది అంటూ వారిని అపార్థం చేసుకుని అక్కడి నుంచి ఏకంగా పూజ గదిలోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత సౌందర్య దంపతులు వాళ్ళందరూ బయటికి రాగా సౌర్య పసుపు తాడు తీసుకుని వచ్చి మెడలో కట్టు అంటూ అందరికి షాక్ ఇస్తుంది. అప్పుడు నిరుపమ్ పసుపు తాడు కట్టబోతూ ఉండగా అడ్డుకోవడంతో వెంటనే సౌర్య,హిమ పై సీరియస్ అవుతూ ఎందుకు వద్దంటున్నావే అంటూ మండి పడుతుంది.

నేను మీ ఇద్దరికీ ఏం ద్రోహం చేశాను ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు అంటూ ఎమోషనల్ అవుతుంది సౌర్య. ఆ తర్వాత సౌర్య ఎమోషనల్ అవుతూ అక్కడ నుంచి వెళ్ళిపోయి రూములో ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు హిమ నిరుపమ్ ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయగా నిరుపమ్ మాత్రం హిమ పై విరుచుకుపడతాడు. నా ఊపిరి ఉన్నంతవరకు నేను నీతోనే కలిసి జీవిస్తాను నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను ఇంకెవరిని పెళ్లి చేసుకోను అంటూ తెగేసి చెప్తాడు నిరుపమ్.

ఆ తర్వాత చివరిగా నేను నీకు ఒక్క విషయం చెబుతున్నాను గుర్తుపెట్టుకో హిమ అని అంటాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో సౌందర్య,సౌర్యకి జడ వేస్తూ ఉండగా అప్పుడు సౌందర్య ఏం కావాలో అడుగు అని అడగగా ఇంట్లో జరిగే నాటకాలు ఆపు నానమ్మ అనడంతో ఇంతలోనే నిరుపమ్ లగేజ్ తీసుకొని సౌందర్య ఇంటికి వస్తాడు.

Advertisement

Read Also : Karthika Deepam: హిమను చూసి మురిసిపోతున్న ప్రేమ్.. హిమ, నిరుపమ్ లకు షాక్ ఇచ్చిన సౌర్య..?

Exit mobile version