Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Mukesh Ambani : ముకేశ్ అంబానీలో సింగింగ్ టాలెంట్.. భలే పాడారుగా.. వీడియో!

mukesh-ambani-sing-his-favourite-song-hum-honge-kamyaab

mukesh-ambani-sing-his-favourite-song-hum-honge-kamyaab

Mukesh Ambani : ఆసియాలోనే అపర కుబేరుడు.. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు కూడా… ఆయనే రిలయన్ప్ అధినేత ముఖేశ్ అంబానీ.. ఆయనో వ్యాపారవేత్తగా ఎంత సక్సెస్ అయ్యారో ప్రపంచానికి అందరికి తెలుసు.. ఆయనలో మరో టాలెంట్ దాగి ఉందని చాలామందికి తెలియకపోవచ్చు. అదే.. సింగింగ్ టాలెంట్..

అవును.. ఆయన అద్భుతంగా పాడుతారు కూడా.. పెట్రోల్ నుంచి టెలికాం వరకు, రిటైల్ వ్యాపారం నుంచి డిజిటల్ బిజినెస్ వరకు ఎన్నో వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ముఖేశ్ అంబానీ.. పాటలు బాగా పాడతారట.. ఆ విషయం ఓ ఇంటర్వ్యూలో సతీసమేతంగా పాల్గొన్న సందర్భంగా హోస్ట్ గుర్తించారు. మీకు నచ్చిన పాట ఏంటి అని అంబానీ అడగ్గా.. ఏకంగా పాటను పాడే అందరిని ఆశ్చర్యపరిచారు అంబానీ..ఇది ఇప్పటి ఇంటర్వ్యూ కాదులేండీ.. 2013లో తన సతీమణితో సహా పాల్గొన్న ఇంటర్వూలోది..

హోస్ట్ సిమి గరేవాల్ నచ్చిన పాట ఏంటంటే 80ఏళ్ల పాట’ హమ్ హోంగే కామ్యాబ్’ అనే పాటను పాడారు. Rendezvous సిరీస్‌లో భాగంగా గరేవాల్ ముకేశ్ అంబానీ, భార్య నీతు అంబానీలను ఇంటర్వూ చేయగా.. ఆ సమయంలో అంబానీ హిందీ పాట “Hum honge kamyaab…” పాటను పాడారు. ఇంతకీ ఆ పాటకు అర్థం ఏంటంటే.. మేము అధిగమిస్తాము అని అర్థమట.. అప్పటి వీడియోను గరేవాల్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేయడంతో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Advertisement

Read Also : Elon Musk: మస్క్​ కు పోటీగా ఎయిర్టెల్​ ఏం చేసిందంటే..?

Exit mobile version