Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

MP GVL Narasimharao : విశాఖ రైల్వేజోన్‌‌కు త్వరలోనే గుడ్ న్యూస్ : ఎంపీ జీవీఎల్ నరసింహరావు

MP GVL Narasimharao : విశాఖ రైల్వేజోన్‌‌కు త్వరలోనే ఆమోద ముద్ర పడుతుందని, తమ పయనం జనసేన తోనేనని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. విజయవాడ కేంద్రంగా నిర్మాణం పూర్తి అయిన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, భూమిపూజలు చేసేందుకు నితిన్‌ గడ్కరీ ఏపీకి వచ్చారు. ఏపీ సీఎం జగన్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాజాగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో 51 వేల జాతీయ రహదారులను ప్రారంబించారని, దీనిని బట్టి బీజేపీకి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్దమౌతుందన్నారు. ఏపీపై గడ్కరి వరాల వెల్లువ ప్రకటించారని, రానున్న రోజులలో లక్షల కోట్లతో ఇన్ ఫ్రాస్టక్చర్ డెవలప్‌మెంట్ చేయనున్నారని వెల్లడించారు. వేల కిమీ రహదారుల నిర్మాణం జరుగుతుందని, ఆరు సంవత్సరాల కాలంలో జాతీయ రహదారి నిర్మాణాలు రెట్టింపయ్యాయని తెలిపారు. జాతీయ విద్యాసంస్థల నిర్మాణానికి భూ సేకరణకు అడ్డంకులు వచ్చాయని, ఈ విషయంలో భూసేకరణకున్న అడ్డంకులను వైసీపీ ప్రభుత్వం సెటిల్ చేయాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

ట్రైబల్ యూనివర్సిటీ లాండ్ ను మార్చినా… ఇంతవరకు కొత్త లాండ్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు వైసీపీ తన స్టిక్కర్ వేసుకుంటూ ప్రచారం చేసుకొంటోందని జీవీఎల్ ఆరోపించారు. మిర్చి పంటతో రైతులు 80 శాతం నష్టపోయారని… రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు పరిహారం ఇవ్వాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Exit mobile version