Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Karthika Deepam Sep 7 Today Episode : మోనితను రోడ్డుపై వదిలేసిన కార్తీక్.. డాక్టర్ బాబుకి తల మసాజ్ చేస్తున్న వంటలక్క..?

Karthika Deepam Sep 7 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో బాగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మోనిత కావాలనే డాక్టర్ తో కలిసి నాటకం ఆడుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్,మోనిత ను ఇంటికి పిలుచుకొని వస్తాడు. అప్పుడు మోనిత కావాలనే కార్తీక్ ముందు నటిస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ మరింత ప్రేమ చూపించడంతో నువ్వు ఇలా ప్రేమ చూపిస్తే నేను ఇంకా బాగా నటిస్తాను కార్తీక్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది మోనిత. అప్పుడు దీప గురించి మాట్లాడుతూ దీపా గురించి తప్పుగా చెప్పే ప్రయత్నం చేస్తుంది.

Karthika Deepam Sep 7 Today Episode

అప్పుడు డ్రైవర్ శివ మీరు ఇచ్చిన వార్నింగ్ కి ఎదురింట్లో తాళం పడిపోయింది సార్ అని అంటాడు. మరొకవైపు హిమ, ఫోన్లో సౌర్య ఫోటో చూస్తూ సౌరకి బర్తడే విషెస్ చెబుతుంది. ఇంతలోనే అక్కడికి సౌందర్య ఆనందరావు రావడంతో వారితో మనం శౌర్య దగ్గరికి వెళ్దాము అని అంటుంది. అంతేకాకుండా వారిద్దరితో కలిసి మాట కూడా తీసుకుంటుంది. అప్పుడు సౌర్య గురించి వారు నచ్చజెప్పి ప్రయత్నం చేయగా హిమ మాత్రం వెళ్దాం అని పట్టు పడుతుంది.

Karthika Deepam Sep 7 Today Episode :  డాక్టర్ బాబుకి తల మసాజ్ చేస్తున్న వంటలక్క..?

మరొకవైపు గుడికి వెళ్లిన దీప తన పిల్లల పేరు మీద అర్చన చేయిస్తూ ఉంటుంది. ఇంతలోనే అదే గుడికి శౌర్య వారణాసి ఇద్దరు వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత వారణాసికి తన పుట్టినరోజు అని చెప్పడంతో వారణాసి ముందే చెప్పాలి కదా సౌర్యమ్మ అని అంటాడు. తర్వాత ఇద్దరు కలిసి గుడి లోపలికి వెళ్తారు. మరోవైపు దీప పూజలు చేస్తూ ఉంటుంది.

Advertisement

ఇంతలోనే అదే గుడికి కార్తీక్,మోనిత ఇద్దరూ వస్తారు. అప్పుడు కార్తీకదీపం గురించి మంచిగా మాట్లాడటం తో వెంటనే మోనిత ఎలా అయినా కార్తీక్, దీప గురించి ఆలోచించడం మానేయాలి అని బలవంతంగా కార్తీక్ ని లోపలికి పిలుచుకొని వెళ్తుంది. అప్పుడు కార్తీక్,మోనిత ఇద్దరూ లోపలికి వెళుతుండగా అది చూసిన దీప వారినే ఫాలో అవుతూ లోపలికి వెళుతుంది. లోపలికి వెళ్లిన తర్వాత మోనిత, కార్తీక్ తో ఇకపై ఎప్పుడూ దీప గురించి ఆలోచించకూడదు మాట్లాడకూడదు అలా అనే ప్రమాణం చేయి అని అంటుంది.

దాంతో ఆ మాటలు విన్న దీప ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు కార్తీక్ బలవంతంగా ప్రమాణం చేయబోతుండగా అక్కడికి దీప వచ్చి దీప ప్రమాణం చేస్తుంది. అప్పుడు మోనిత తప్పు చేసి ప్రమాణం చేయడం నీకు అలవాటే కదా అని అనగా వెంటనే దీప నీకు ఒంట్లో బాలేదు అని హాస్పిటల్ కి వెళ్ళావు కదా అది నిజం అయితే నువ్వు ప్రమాణం చేయి అని అంటుంది.

అప్పుడు మోనిత సౌర్యను చూసి సౌర్య ఏంటి ఇక్కడ అని సౌర్య చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది మోనిత. అప్పుడు మోనిత అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎలా అయినా కార్తీక్ ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోవాలి అని అనుకుంటుంది. రేపటి ఎపిసోడ్లో కార్తీక్, మోనిత కార్లో వెళుతూ ఉండగా మధ్యలో కారు ఆపి రోడ్డుపై కార్తీక్ ను దీప విషయంలో ప్రమాణం చేయమని అంటుంది.

Advertisement

ఇప్పుడు కార్తీక్ కోపంతో నేను నీకు ఎలా కనిపిస్తున్నాను నువ్వు చెప్పినట్లు చేయాలా నేను ఏం చేయను అంటూ మోనిత ను అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు అడ్రస్ తెలియకుండా ఎక్కడికి వెళ్తున్నాడు కార్తీక్ అని టెన్షన్ పడుతూ ఉంటుంది మోనిత. ఇక మోనిత టెన్షన్ తో ఇంటికి వెళ్లి చూసేసరికి అక్కడ దీప కార్తీక్ కు తల కు మసాజ్ చేస్తూ ఉంటుంది.

Read Also : Guppedantha Manas seurial Sep 7 Today Episode : వసుధారని తన ఇంటిలో పర్మినెంట్ గా ఉండిపోమని అడిగిన రిషి.. సరికొత్త ప్లాన్ వేసిన దేవయాని..?

Advertisement
Exit mobile version