MLA Roja: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సంతాప తీర్మానం ప్రకటించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి గౌతమ్ రెడ్డిని గుర్తు చేసుకుని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇకలేరు అనే విషయాన్ని, ఆయన లేని లోటును పూడ్చలేమని జగన్ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే,ఏపీఐఐసి ఛైర్‌పర్సన్‌గా విధులు నిర్వహిస్తున్న రోజా గౌతమ్ రెడ్డి మృతుని తలుచుకుని అసెంబ్లీ సాక్షిగా కన్నీటిపర్యంతమయ్యారు.
గౌతమ్ రెడ్డి ఒక బాహుబలి అని అలాంటి వ్యక్తి క్షణాల్లో మాయం అయ్యారనే విషయం,ఆయన ఇకపై మనతో లేరనే విషయాన్ని ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదంటూ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని గుర్తు చేసుకుని రోజా అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకున్నారు. గౌతమ్ రెడ్డి అన్న ముఖ్యమంత్రిగా కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో మంచి వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారని ఆయనను తలుచుకుని రోజా కన్నీటి పర్యంతమయ్యారు.