Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

MLA Mekapati Sucharitha : మంత్రి పదవి ఇవ్వలేదని ఎమ్మెల్యే పదవికి సుచరిత రాజీనామా..!

MLA Mekapati Sucharitha : మంత్రి వర్గంలో తనకు చోటు ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న మా అమ్మ.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని మాజీ హోంమంత్రి సుచరిత కుమార్తె రిషిత తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటికీ.. ఆమె వైసీపీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. వైసీపీలో రెడ్డికో న్యాయం, ఎస్సీలకో న్యాయం చేస్తారా అంటూ సుచరిత వర్గీయులు భగ్గుమన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

mla mekapati suharitha resign as mla

అయితే మంత్రి పదవి రాలేదని అసంతృప్తికి లోనైన బాలినేని శ్రీనివాస రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించిన సజ్జల.. ఎస్సీ మహిళ అయిన మేకపాటి సుచరిత కుటుంబీకులను కలిసే అవకాశం కూడా ఇవ్వకపోవడం న్యాయం కాదంటూ మండిపడ్డారు. సుచరితకు మంత్రి వర్గంలో స్థానం కల్పించకపోవడంపై గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వైకాపా నేతలు, కార్యకర్తలు ఆదివారం గుంటూరులో ఆందోళనకు దిగారు. అంతకు ముందు సుచరిత ఇంటి ముందు బైఠాయించి… సజ్జలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం లాడ్జి సెంటరు ప్రధాన రహదారిపై టైర్లు తగుల బెట్టి ట్రాఫిక్‌ను నిలిపివేసి ఆందోళన చేశారు.

Read Also : KGF2: ఆర్ఆర్ఆర్ సినిమాకంటే కేజీఎఫ్2 నిర్మాతకే లాభమెక్కువా..?

Advertisement
Exit mobile version