Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

BJP VS TRS: ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ దాడి.. అందుకేనా? రిపీట్ అయితే మేమేంటో చూపిస్తామన్న తలసాని!

BJP VS TRS : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందనే ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఈ నిరాధారమైన ఆరోపణలు సరికాదంటూ కవిత కామెంట్లు కూడా చేశారు. కావాలనే తనపై కక్ష్య పూరిత ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలోనే సోమవారం కవిత ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడికి ప్రయత్నించారు. తప్పుడు ప్రచారాన్ని పట్టుకొని టీఆర్ఎస్ కవిత ఇంటిపై దాడి చేయడాన్ని టీఆర్ఎల్ మంత్రుల, ఎమ్మెల్యేలు, నేతలు ఖండిస్తున్నారు.

minister talasani srinivas yadav

సోమవారం ఎల్బీ స్టేడియం వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాల్లో పొల్గొన్న సమయంలో బీజేపీ నేతలు కవిత ఇంటిపైకి రావడం దుర్మార్గం అని, హేయమైన చర్య అంట అభివర్ణించారు. ఈ క్రమంలోనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కవితకు సంఘీభావం తెలిపారు. మహిళా ప్రజాప్రతినిధి ఇంటిపైకి బీజేపీ నేతలు రావడం హేయమైన చర్యగా పేర్కొన్నారు.

ఇలాంటి దుర్మార్గపు చర్యలను తిప్పి కడతామన్నారు. ఇంకోసారి రిపీట్ అయితే తామేంటో చూపిస్తామని హెచ్చరించారు. మేం మీ ఇళ్లకు రావాలంటే పెద్ద టైమ్ పట్టదని.. టీఆర్ఎస్ సైన్యం ఎంత ఉందో తెలుసా అంటూ బీజేపీ నేతలను హెచ్చరించారు మంత్రి తలసాని. విద్యేశ పూరితమైన చర్యలకు దిగితే ఊరుకోబోమంటూ హెచ్చరించారు.

Advertisement

Read Also :  Ponguleti Srinivas : టీఆర్ఎస్ పొంగులేటి గుడ్‌బై చెప్పనున్నాడా.. నిజమెంత?

Exit mobile version