Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

LPG Cylinder Price : సామాన్యులకు మళ్లీ షాక్.. భారీగా పెరిగిన వంటగ్యాస్ ధర.. ఎంతంటే?

LPG Cylinder Price : సామ్యానులకు మళ్లీ షాక్.. భారీగా వంటగ్యాస్ ధరలు పెరిగిపోయాయి. బుధవారం (జూలై 6) నుంచి కొత్త గ్యాస్ సిలిండర్ ధరలు అమల్లోకి వచ్చేశాయి. పేద, మధ్యతరగాతి వర్గాల నెత్తిన గ్యాస్ బండ భారం పడింది. దేశీయ చమురు సంస్థలు వంటగ్యాస్ వినియోగదారులకు షాకిచ్చాయి. గృహావసరాలకు వాడే 14.2 కిలోల సిలిండర్‌ ధర మళ్లీ పెరిగింది. సిలిండర్ ధరను రూ.50 పెంచుతూ చమురు సంస్థలు వెల్లడించాయి.

దాంతో గ్యాస్‌ సిలిండర్ రేటు రూ.1100 పెరిగింది. పెట్రో ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామన్యులపై గ్యాస్ ధర పెరగడం మరింత భారాన్ని పెంచింది. కొత్తగా పెంచిన గ్యాస్ సిలిండర్ ధర దేశరాజధాన ఢిల్లీలో ప్రస్తుత గ్యాస్ సిలిండర్ ( రూ.1003) ధర రూ.1053కు చేరుకుంది.

LPG Cylinder Price Hike Again, Cylinder New Prices will effect from Today

హైదరాబాద్లో గ్యాస్‌ బండ ధర రూ.1055 నుంచి రూ.1105కు చేరింది. ప్రతి నెల 1న గ్యాస్ ధరలను చమురు సంస్థలు మార్చేస్తున్నాయి. ఈ నెల 1న 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌ ధరను రూ.183.50 మేర తగ్గించాయి. అదే నెలలో 5 రోజులు గడిచిన తర్వాత డొమెస్టిక్ గ్యాస్‌ సిలిండర్ ధరను పెంచేశాయి. పెంచిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు ఈరోజు నుంచే అమల్లోకి వచ్చేశాయి.

Advertisement

Read Also : PV Sindhu: బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధులో ఈ యాంగిల్ కూడా ఉందా… రీమిక్స్ సాంగ్ కు

Exit mobile version