Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Bussiness ideas : రైతులను లక్షాధికారులను చేస్తున్న పంట.. ఏమిటో తెలుసా?

Bussiness ideas : మీకు ఒకరి కింద ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోయినా.. వ్యాపారాలు చేయాలనే ఆసక్తి లేకపోయినా వెంటనే ఇంటికి వెళ్లిపోయి.. హాయిగా ఉన్న కాస్త భూమిలోనే సంప్రదాయ పంటలకు బదులుగా వాణిజ్య పంటలు వేసి లక్షలు సంపాదించండి. ఏంటీ ఉన్న కాస్త భూమిలోనే లక్షలు సంపాదించాలా.. అని అనుకుంటున్నారా.. అవునండి ఇది నిజమే. ఉన్న కొంచెం భూమిలనే నిమ్మతోట వేశారంటే.. ఏడాది తిరిగేకల్లా మీరు లక్షాధికారి అవడం ఖాయం. అయితే అదెలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మకాయను మనం ప్రతిరోజూ వంటకాల్లో వాడుతుంటాం. ఊరగాయ దగ్గర నుంచి పెద్ద పెద్ద హోటళ్లలో హాండ్ వాష్ వరకూ నిమ్మకాయనే వాడుతుంటారు. అయితే అంత డిమాండ్ ఉన్న నిమ్మకాయ మొక్కను ఒక్కసారి నాటితే 10 సంవత్సరాల వరకు దిగుబడి ఇస్తుంది. అయితే మొక్కను నాటిన మూడేళ్ల తర్వాతే అది ఏపుగా పెరిగి… ఏడాది పొడవునా దిగుబడి ఇస్తుంది. అయితే ప్రపంచంలోనే అత్యధికంగా నిమ్మకాయలను సాగు చేసేది మన దేశమే. అయితే నిమ్మ సాగు కోసం ఇసుక, లోమీ నేలలు ఉత్తమమైనవిగా పరిగణిస్తారు. రెడ్ లేటరైట్, ఆల్కలీన్, కొండ ప్రాంతాల్లో కూడా వీటిని పండించొచ్చు.

lemon farming bussiness is very better idea to farmers

నిమ్మ మొక్కలు నాటేందుకు ఖర్చు కూడా చాలా తక్కువే. అయితే నెల రోజుల వయసున్న నిమ్మ మొక్కలను నర్సరీ నుంచి తీసుకొచ్చి నాటడం చాలా మంచిది. అయితే ఒక చెట్టుకు దాదాపు 30 నుంచి 40 నిమ్మకాయలు వస్తాయి. మందపాటి తొక్క ఉంటే 50 కిలోల వరకు వస్తాయి. అయితే నిమ్మకాయలకు ఏడాది పొడవునా డిమాండ్ ఉన్నందున కిలో ధర దాదాపు 40 నుంచి 70 వరకు ఉంటుంది. ఈ లెక్కన ఎకరం భూమిలో నిమ్మ సాగు చేసి సులువుగా 4 నుంచి 5 లక్షలు ఆదాయం పొందొచ్చు. అయితే ఈ మధ్య యాపిల్ పండ్ల కంటే కూడా నిమ్మకాయల ధరే ఎక్కువైంది. దాదాపు కిలోకు 400 రూపాయలు పలుకుతోంది.

Advertisement

Read Also : Bussiness idea : రెండెకరాల భూమి ఉంటే చాలు.. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసి కోటీశ్వరులు అవ్వొచ్చు!

Exit mobile version