Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Karthika Deepam Serial : కార్తీకదీపం హిమకు సన్మానం.. వైరల్ అవుతున్న వీడియో!

Karthika Deepam Serial : కార్తీక దీపం సీరియల్ గురించి అందులో నటించే నటుల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వంటల్ల, డాక్టర్ బాబు, సౌందర్యతో పాటు హిమ, శౌర్య పాత్రలకు కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ మధ్యే ఈ సీరియల్ లోని హిమ, శౌర్య పాత్రలు పెద్ద వాళ్లయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ పాత్రల్లో గతంలో నటించిన చిన్నారులకు బదులుగా వేరే వాళ్లు నటిస్తున్నారు. అయితే సీరియల్ ని వదిలి వెళ్లినప్పటికీ.. హిమ, శౌర్య పాత్రల్లో నటించిన అమ్మాయిలు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటున్నారు.

Karthika Deepam Serial

హిమ పాత్రలో నటించి సహృదకు సెపరేట్ గా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మంటి అభిమానాన్ని సంపాదించుకుంది. ఇక సహృద ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ సోషల్ మీడియా ద్వారా అందరికీ దగ్గరలో ఉంది. అయితే ఇటీవలే సహృద ఫొటోషూట్ తీయించుకుంది. అందుకు సంబందించిన ఫొటోలను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అలాగే తనకు విజయనగరంలో జరిగిన సన్మానానికి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అక్కడకు వచ్చిన వారంతా సహృదతో సెల్ఫీలు దిగారు. అంతే కాకుండా తనకు పలువురు సన్మానం చేయగా.. ఆ తర్వాత పలువురితో క్యాట్ వాక్ చేసి ప్రేక్షకులను ఆలరించింది.

Advertisement
Exit mobile version