Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Karthika Deepam : మరోసారి పెళ్లి చేసుకున్న కార్తీక్.. దీప… షాకింగ్ గా మోనిత ఎంట్రీ!

Karthika Deepam Feb 12 Tody Episode : బుల్లితెరపై ప్రసారం అవుతూ రోజురోజుకు ఎంతో మంచి ఆదరణ పొందుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజురోజుకు ఈ సీరియల్ ఎంతో ఉత్కంఠభరితంగా మారుతోంది. మరి నేటి ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా మారింది. సౌందర్య దీప కార్తీక్ పిల్లలని తీసుకుని ఇంటికి వస్తుంది. ఇంట్లో అందరూ కూర్చుని సరదాగా మాట్లాడుతున్న సమయంలో హిమ ఆనంద్ అచ్చం నాన్నలాగే ఉన్నారు కదా నానమ్మ అంటుంది. ఆ మాటకు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ మాటలు విన్న సౌందర్య తప్పు అలా అనకూడదు అంటూ సర్ది చెబుతుంది.

Karthika Deepam Feb 12 Tody Episode

మరో వైపు భారతి, మోనిత కారులో వెళ్తూ అలాగే మా అత్తగారి దర్శనం చేసుకొని వెళ్దాం భారతి అంటుంది. మీ మావయ్య అందరికీ పార్టీ ఇవ్వమని చెప్పారు అంటూ సౌందర్య చెప్పగా కార్తీక్ ఏం పార్టీ మమ్మీ అని అడుగుతారు. కానీ సౌందర్య ఏ విషయం చెప్పలేదు.ఇక కార్తీక్ దీప పెళ్లి రోజు కావడంతో తమ తల్లిదండ్రులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పడం కోసం పిల్లలు గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేస్తుంటారు. అది చూసిన సౌందర్య సంతోషపడుతుంది.పిల్లలు ఇద్దరు వాళ్ల తల్లిదండ్రుల గురించి సౌందర్య అని అడగగా సౌందర్య ఆ చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకొని బాధపడుతుంది.

ఇక ఆ ప్రస్తావన గురించి పక్కన పెడుతూ సౌందర్య ఈరోజు మీ అమ్మానాన్నల పెళ్లిరోజు కదా వారికి ఈ విషయం చెప్పకండి వారిద్దరినీ సర్ప్రైజ్ చేద్దాం అంటూ చెప్పడంతో పిల్లలు కూడా సరే అంటారు. అందరు కలిసి ఇల్లు మొత్తం డెకరేషన్ చేస్తూ హంగామా చేస్తారు. ఇదంతా చూసిన కార్తీక్ కు ఏమీ అర్థం కాదు అంతలోనే ఆదిత్య వెళ్లి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటూ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియచేస్తారు.ఇక సౌందర్య వెళ్లి నీ పెళ్లి మేము చూడలేక పోయాము అందుకే ఆ లోటును ఇప్పుడు మీకు పెళ్లి చేసి తీర్చుకోవాలి అనుకుంటున్నాము అంటూ కార్తీక్ ను పెళ్లి కొడుకుగా తయారు చేస్తారు.

Advertisement

సౌందర్య నేను వెళ్లి పెళ్లి కూతురును తీసుకు వస్తానని చెప్పి దీపను అందంగా ముస్తాబు చేసి తీసుకు వస్తుంది. ఇలా కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషంగా దీపా కార్తీక్ పెళ్లి చేస్తూ ఎంతో సంతోషం వ్యక్తం చేయగా అనుకోకుండా ఈ వేడుకలకు మోనిత ఎంట్రీ ఇస్తుంది. అయితే మోనిత ఆ తర్వాత ఏం మాట్లాడనుందో తెలియాలంటే తరువాత ఎపిసోడ్ వరకు వేచి చూడాలి.

Read Also : Karthika Deepam Feb 10 Episode : సూపర్ క్లైమాక్స్.. సౌందర్య ఎంట్రీతో రుద్రాణికి చెక్..! మండిపోతున్న మోనిత..!

Advertisement
Exit mobile version