Kacha Badam Viral Song : సోషల్ మీడియా.. రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్ చేసేస్తుంది. టాలెంట్ ఉండి గుర్తింపులేని ఎందరో వ్యక్తులకు పునాది వేసింది.. సోషల్ మీడియా.. ఇప్పటివరకూ ఎందరో సోషల్ మీడియా వేదికగా స్టార్ డమ్ అందుకున్నారు. నిన్నటివరకూ వారు ఎవరో తెలియదు.. ఒక్కసారిగా పాపులర్ అయిపోతుంటారు. సోషల్ మీడియాలో సెన్సేషన్ చేసేస్తుంది.
అంత పవర్ ఫుల్ సోషల్ మీడియా.. అందుకే ఈ ప్లాట్ ఫాంను ఎంచుకుంటుంటారు చాలామంది. ఎవరిని ఎప్పుడూ ఈ సోషల్ మీడియా పాపులర్ చేస్తుందో ఊహించలేమంతే.. ఇప్పుడు అలాంటి ఓ మాములు పల్లీలు అమ్మే వ్యక్తి.. సోషల్ మీడియా సెన్నేషన్ స్టార్ అయిపోయాడు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఒకే పాటు బాగా వినిపిస్తోంది..
అదే.. ‘కచ్చా బాదం’ (Kacha Badam) పాట.. బాగా పాపులర్ అయింది. బెంగాలీ భాషలో ‘కచ్చా బాదం’ (Kacha Badam) అంటే ‘పచ్చి వేరుశెనగ’ (Peanut) అని అర్థం. బెంగాలీలో వేరుశెనగను బాదం అంటారు. అయితే ఈ పాటను పాడిన గాయకుడు భుబన్ బద్యాకర్ (Bhuban Badyakar) ఫేమస్ అయ్యాడు. సెలబ్రిటీలు సైతం ఈ పాటకు పిధా అయిపోతూ డ్యాన్సులతో అదరగొట్టేస్తున్నారు.
Kacha Badam Viral Song : ‘కచ్చా బాదాం’ సింగర్… బూబన్ బద్యాకర్ (Bhuban Badyakar)..
పశ్చిమ బెంగాల్‌లోని బీర్బమ్ జిల్లా లక్ష్మీ నారాయణ్ పూర్ లో దుబ్రజ్ పూర్ కాలనీకి చెందిన ‘బూబన్ బద్యాకర్’ (Bhuban Badyakar) పల్లీలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. రోజుంతా పల్లీలు అమ్మితే కానీ, అతడికి రూ.200 సంపాదించేది.. మూడు నుంచి నాలుగు కిలోల పల్లీలు అమ్ముతాడు. అయితే పల్లీలు ( (Peanut Seller) అమ్ముతూ అతడు పాట పాడుతుంటాడు..
అదే.. ఈ కచ్చాబాదం.. పాటు.. అతడి పాట వింటే ఫిదా కావాల్సిందే.. ఈ పాటను క్రియేట్ చేసింది కూడా ఇతడే.. ‘మీ దగ్గర బంగారపు చైన్లు, గొలుసులు ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి. వాటికి సమానమైన పల్లీలను మీరు తీసుకెళ్లండి. వేయించని పల్లీలు.. (కచ్చా బదాం).. నేను వీటిని వేయించలేదు.. తియ్యగా ఉంటాయి..’ అంటూ బద్యాకర్ బెంగాలీలో లిరిక్స్ రాసుకున్నాడు.
అప్పటినుంచి పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది.. యూటూబ్ స్టార్లు సహా చాలామంది సెలబ్రిటీలు ఈ పాటకు స్టెప్పులేస్తూ అదరగొట్టేస్తున్నారు. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కూడా తనదైన స్టైల్‌లో గ్రూప్ డ్యాన్స్ చేస్తూ అదరగొట్టేశాడు.. భుబన్ పాటను రీమిక్స్ చేసి వైరల్ చేసేస్తున్నారు.
భుబన్.. బీర్భూమ్ జిల్లాలోని కురల్జూరి గ్రామవాసి.. భుబన్ కుటుంబంలో అతని భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంటారు. మొత్తం అతడి కుటుంబలో 5 మంది సభ్యులు ఉన్నారు. భుబన్ మొబైల్స్ వంటి ఎలక్ట్రిక్ పరికరాలను, విరిగిన వస్తువులకు బదులుగా వేరుశెనగ (పల్లీలు) అమ్ముతుంటాడు. రోజూ 3 నుంచి 4 కిలోల పల్లీలు అమ్ముతూ రూ.200 నుంచి రూ. 250 వరకు సంపాదిస్తుంటాడు.
ఇప్పుడు అతని ‘కచ్చా బాదాం’ పాట వైరల్ కావడంతో అతడి పల్లీల అమ్మకాలు మరింత పెరిగాయి. తన పాటకు వస్తున్న ఆదరణ చూసి తన పాట గురించి ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నానని భుబన్ చెప్పుకొచ్చాడు. తన కుటుంబం జీవించడానికి ప్రభుత్వం ఏదైనా సాయం చేయాలని కోరుతున్నాడు. తన కుటుంబానికి మంచి ఆహారంతో పాటు మంచి బట్టలు ఉండాలని తాను కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.
Read Also : Maharashtra Politics : ఎన్నికల్లో పోటీకి రెండో భార్య కావాలి.. నగరమంతా బ్యానర్లు కట్టేశాడు..! ఎక్కడంటే?