Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Janaki Kalaganaledu june 28 episode : జ్ఞానాంబను అవమానించిన కామాక్షి.. సంతోష పడుతున్న మల్లిక..?

Janaki Kalaganaledu june 28 episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ జ్ఞానాంబ తన కోడళ్లతో కలిసి బారసాల ఫంక్షన్ కి వెళుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానాంబ వాళ్ళు బారసాల ఫంక్షన్ కి వెళ్లగా అక్కడ కామాక్షి జానకి ఏమైనా విశేషం ఉందా అని అడగడంతో జానకీ మౌనంగా ఉండడంతో వెంటనే జ్ఞానాంబ అలాంటిది ఏమీ లేదు పిన్ని అని అంటుంది. అప్పుడు జ్ఞానాంబ పాపను ఉయ్యాల్లో పడుకోబెట్టగా అది చూసి కామాక్షి కుళ్ళుకుంటూ ఉంటుంది.

Janaki Kalaganaledu june 28 episode

ఆ తర్వాత కామాక్షి,జ్ఞానాంబ ను మీ కోడళ్లకు హారతి పాటలు వస్తాయా అని అనగా మల్లికా కాస్త ఓవర్ చేస్తూ మా అక్క జానకికి వస్తాయి అని అనడంతో వెంటనే జానకి లాలి పాట పాడడంతో అందరూ జానకిని మెచ్చుకుంటారు. ఆ తర్వాత జ్ఞానాంబ సంవత్సరం కిందట అన్న మాటను గుర్తు తెచ్చుకున్న కామాక్షి వారి కుటుంబం పరువు తీసే విధంగా మాట్లాడ
డుతుంది.

Advertisement

వెంటనే జ్ఞానాంబ నువ్వు కావాలనే మా పరువు తీయాలి అని నలుగురిలో ఇలా మాట్లాడుతున్నావు కదా అని అంటుంది. ఇక కామాక్షి మాటలకు బాధపడిన జ్ఞానాంబ ఎలా అయినా మరో నెలలో శుభవార్త చెబుతాను అంటూ గట్టిగా చాలెంజ్ చేస్తుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చి కామాక్షి అన్న మాటలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది జ్ఞానాంబ.

అప్పుడు గోవింద రాజులు ఏం జరిగింది అని అడగడంతో జానకి జరిగింది మొత్తం వివరిస్తుంది. అప్పుడు జానకి కూడా జ్ఞానాంబ ని చూసి బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత పని మనిషి చికితని పిలిచి ఇద్దరి కోడళ్లను పిలుచుకురమ్మని చెబుతుంది.

దాంతో జానకి వెంటనే రాగా మల్లిక మాత్రం అక్కడే ఉండి ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు వేయడంతో వెంటనే జ్ఞానాంబ, మల్లిక అని గట్టిగా అరవడంతో అతడికి ఏమి తెలియనట్టు గా పెరుగుతుంది. ఆ తర్వాత జ్ఞానాంబ తన మనసులోని మాటలను ఇద్దరి కోడళ్ల తో పంచుకుంటుంది.

Advertisement

ఇక ఆ మాట లను గోవింద్ రాజు తో పాటుగా ఇద్దరు కొడుకులు కూడా వింటూ ఉంటారు. అప్పుడు జ్ఞానాంబ నాకు మనవడినో,మనవరాలునో ఇవ్వమని కోరుకుంటుంది. అప్పుడు జానకి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటూ రామ ముఖం చూస్తుంది. వెంటనే జ్ఞానాంబ ఏం జానకి ఇతరుల మనసులో ఉన్న బాధను అర్థం చేసుకుంటావు మరి ఈ అత్తయ్య బాధ ఎదురు చూస్తూ కూడా నీకు అర్థం కావడం లేదా అని అడుగుతుంది.

Read Also : Janaki Kalaganaledu june 27 Today Episode : జానకిపై పొగడ్తలు వర్షం కురిపించిన జ్ఞానాంబ దంపతులు..మల్లిక పై సీరియస్ అయిన జ్ఞానాంబ..?

Advertisement
Exit mobile version