Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Intinti gruhalakshmi : కొత్త సీరియల్ లో కనిపించబోతున్న ఇంటింటి గృహలక్ష్మి విలన్..!

Intinti gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ విలన్.. లాస్య పాత్రలో అభిమానుల్ని అలరిస్తున్న యాంకర్ ప్రశాంతి మరో కొత్త సీరియల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే జీ తెలుగులో రాబోతున్న దేవతలారా దీవించండి అనే కొత్త సీరియల్ వస్తోంది. ఇందులో కూడా యాంకర్ ప్రశాంతి విలన్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా తానే సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానలతో పంచుకుంది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ కంగ్రాట్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Intinti gruhalakshmi

అయితే నెలలో పది హేను రోజులు షూటింగ్, డబ్బింగ్ లతోనే సరిపోతోందని… అందుకే వేరే సీరియల్స్ లో నటించడం కుదరట్లేదని చెబుతోంది. మంచి ఛాలెంజింగ్ పాత్రలు వస్తే మాత్రం అస్సలే వదులుకోనని వివరిస్తుంది. విలన్ పాత్ర్లో నటించే స్పోక్ ఎక్కువగా ఉందని… అందుకే తనకు విలన్ పాత్రలు అంటేనే ఎక్కువ ఇష్టమని స్పష్టం చేసిందీ యాంకర్ ప్రశాంతి. అయితే మరి ఇప్పుడు ఆమె నటించబోయే దేవతలారా దీవించండి సీరియల్ ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే ఇంకా కొన్నాళ్లు ఆగాల్సిందే.

Read Also : Janaki Kalaganaledu Climax : అయ్యో.. క్లైమాక్స్‌లో జానకిరామ చనిపోతారట? వంటలక్క, డాక్టర్ బాబులానే.. బాబోయ్.. ఇదేం ట్విస్ట్..!

Advertisement
Exit mobile version