Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Karthika Deepam Oct 31 Today Episode : సౌర్య విషయంలో నిర్ణయాన్ని మార్చుకున్న ఇంద్రుడు.. సౌర్య దగ్గరికి చేరుకున్న కార్తీక్, దీప..?

Karthika Deepam Oct 31 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వంటలక్క తయారవుతూ ఉండగా ఇంతలో అక్కడికి డాక్టర్ బాబు వస్తాడు.

ఈరోజు ఎపిసోడ్ లో దీప నా సౌర్య నన్ను చూడగానే దగ్గరికి వస్తుంది అని అనడంతో వెంటనే కార్తీక్ వంటలక్కను చూడగానే ఎవరికైనా సంతోషం వస్తుంది అలాంటిది శౌర్య ఊరికె ఉంటుందా అని అనడంతో దీప సంతోషపడుతుంది. అప్పుడు కార్తీక్ కి వాల్తేరు వాణి ఎక్కడికి వెళ్ళింది కనిపించట్లేదు అని అనడంతో అదే నేను ఫోన్ చేస్తున్నాను డాక్టర్ బాబు కలవడం లేదు అనటంతో ఎక్కడికైనా బయటికి వెళ్లిందేమో అని అంటాడు.

Karthika Deepam Oct 31 Today Episode

ఆ తర్వాత కార్తీక్ రెడీ అయి వస్తాను అని అక్కడ నుంచి వెళ్లిపోతాడు. మరొకవైపు ఇంద్రమ్మ ఇంద్రుడు రాలేదు అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంద్రుడు దంపతులు మాట్లాడుకుంటూ హడావిడి చేస్తూ ఉంటారు. అప్పుడు ఇంద్రుడు జ్వాలమ్మా ఎప్పుడైనా మన దగ్గర నుంచి వెళ్ళిపోవాల్సిందే కదా అని అనగా వెంటనే ఇంద్రమ్మ నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు గండ ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమం చూడు అని అంటుంది.

Advertisement

మురుగవైపు కార్తీక్,దీప ఇద్దరు సౌర్య దగ్గరికి వెళుతున్నందుకు ఆనందంగా కారులో మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. దీప సౌర్య దగ్గరికి వెళ్తున్నందుకు మరింత సంతోషంగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు దీప ఇప్పటికే సౌర్యని కలుసుకోవడానికి చాలాసార్లు అవకాశం వచ్చిన దానిని మిస్ చేసుకున్నాను అని అనుకుంటూ ఉంటుంది. మరి ఆరోజు రాత్రి ఎందుకు వెళ్ళలేదు.

Karthika Deepam అక్టోబర్ 31 ఎపిసోడ్ : శివ ను గన్నుతో బెదిరించిన మోనిత..ఇంద్రుడు టెన్షన్..

అప్పుడే వెళ్లింటే ఈ పాటికి సౌర్య దొరికేది కదా అని కార్తీక్ దీప మీద అరుస్తాడు. మరొకవైపు సౌర్య ఏర్పాట్లు చూసి దీప ని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఎవరినో చూసి అమ్మ బాబాయి అంటూ ఏడుస్తూ ఉంటుంది శౌర్య. ఇప్పుడు సౌర్య అమ్మ కావాలి అని ఏడవడంతో ఇంద్రమ్మ దంపతులు కూడా ఎమోషనల్ అవుతారు. ఇప్పుడు ఇంద్రుడు దీప అన్నమాట తలుచుకుని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు.

Indrudu gets emotional as he convinces himself in todays karthika deepam serial episode

మరొకవైపు మోనిత కోపంతో ఇంట్లో వస్తువులన్నీ విసిరేస్తూ ఉంటుంది. అప్పుడు శివ ఏమైంది మేడం అని అరుస్తూ ఉండగా ఇక్కడ నుంచి వెళ్ళిపో లేకపోతే చంపేస్తాను అని అంటుంది. అప్పుడు శివని చూసి దీప అనుకోని శివ ను గన్నుతో చంపేస్తాను అని బెదిరిస్తూ ఉంటుంది. అప్పుడు శివ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. మరొకవైపు దీప కార్తిక్ లు ఇంద్రుడు కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడు ఇంద్రుడు కనిపించకపోయేసరికి టెన్షన్ పడుతూ ఉంటారు.

Advertisement

అప్పుడు దీప సౌర్యని కలవనేమో అని భయపడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి ఇంద్రుడు రావడంతో దీప, కార్తీక్ ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఇంద్రుడు వాళ్లని ఇంటికి పిలుచుకొని వెళ్తాడు. అప్పుడు ఇంద్రుడు ఇంట్లో పూజారి అన్న మాటలు తలుచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. సౌర్య విషయంలో తాను ఆలోచించింది తప్పు అని అనుకొని బాధపడుతూ ఉంటాడు.

Read Also : Karthika Deepam Oct 29 Today Episode : అడ్డంగా దొరికిపోయిన వాణి.. మోనిత వాణిలకు వార్నింగ్ ఇచ్చిన దుర్గ..?

Advertisement
Exit mobile version